కెప్టెన్ అనేవాడు, టీమ్ గర్వపడేలా ఉండాలి! నీలా కాదు... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కపిల్ దేవ్ ఫైర్...

Published : Jan 08, 2023, 09:59 AM IST

విరాట్ కోహ్లీ నుంచి టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు రోహిత్ శర్మ. అయితే ఏ ముహుర్తాన భారత జట్టు సారథిగా బాధ్యతలు తీసుకున్నాడో కానీ ఏడాదిలో రోహిత్ ఆడిన మ్యాచుల కంటే రెస్ట్, ఫిట్‌నెస్ సమస్యలతో తప్పుకున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ..

PREV
16
కెప్టెన్ అనేవాడు, టీమ్ గర్వపడేలా ఉండాలి! నీలా కాదు... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కపిల్ దేవ్ ఫైర్...
Rohit Sharma

రోహిత్ శర్మ ఫిట్‌నెస్ సమస్యల కారణంగా 2022 ఏడాదిలో రికార్డు స్థాయిలో ఏడుగురు కెప్టెన్లను మార్చింది టీమిండియా. రోహిత్ శర్మ కంటే శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ ఎక్కువ మ్యాచులకు కెప్టెన్సీ చేశారు..

26

గాయం కారణంగా సౌతాఫ్రికా టూర్‌కి దూరమైన రోహిత్ శర్మ, ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌లోనూ ఆడలేదు. బంగ్లాదేశ్ టూర్‌లో రెండో వన్డేలో గాయపడిన రోహిత్, టెస్టు సిరీస్‌కి కూడా అందుబాటులో లేకుండా పోయాడు...

36

‘రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి, అతని ఆట గురించి నేనేమీ చెప్పదల్చుకోలేదు. అతను ఇప్పటికే నిరూపించుకున్న ప్లేయర్. అయితే అతని ఫిట్‌నెస్‌పైనే నా డౌట్.. ఇప్పుడు అతను ఫిట్‌గా ఉన్నాడా?

46
Image credit: PTI

ఎందుకంటే కెప్టెన్ ఫిట్‌గా ఉంటే మిగిలిన ప్లేయర్లు అతని నుంచి స్ఫూర్తి పొందుతారు. తమ కెప్టెన్‌ని చూసి గర్వంగా ఫీల్ అవుతారు. రోహిత్ శర్మ విషయంలో అలా జరుగుతోంది. రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై నాకు అనేక అనుమానాలు ఉన్నాయి...
 

56

కెప్టెన్ అయ్యాక రోహిత్ శర్మ పెద్దగా పరుగులు చేయలేకపోతున్నాడు. అతని క్రికెట్ స్కిల్స్‌పై ఎలాంటి సందేహాలు అవసరం లేదు. అతను మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్రికెటర్లలో ఒకడు. అయితే అతని ఫిట్‌నెస్‌పైనే నా డౌట్...

66

ఫిట్‌నెస్ సరిగ్గా లేని ప్లేయర్‌కి కెప్టెన్సీ అప్పగిస్తే ఆ ప్రభావం పూర్తి టీమ్‌పైన పడుతుంది. ఫిట్‌గా లేకపోతే రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటేనే బెటర్...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్...

Read more Photos on
click me!

Recommended Stories