చుక్కలన్నీ ఒకవైపు, ఈ ‘సూర్య’ ఒకవైపు... వీడియో గేమ్ ఆడినంత ఈజీగా సిక్సర్లు బాదేస్తూ...

First Published Jan 7, 2023, 9:19 PM IST

మూడేళ్ల క్రితం విరాట్ కోహ్లీ అలా వరుసగా సెంచరీల మీద సెంచరీలు బాదుతుంటే, క్రికెట్ ఆడడం ఇంత ఈజీగా అన్నట్టు ఉండేది చూడడానికి! ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ అదే చేస్తున్నాడు. నిజానికి అంతకుమించి... వీడియో గేమ్ ఆడినట్టు ధనాధన్ ఇన్నింగ్స్‌లను చూపిస్తూ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు... విరాట్ తుఫాన్ అయితే సూర్య సునామీయే.. 

Suryakumar Yadav

గత ఏడాది ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై మొట్టమొదటి టీ20 సెంచరీ బాదిన సూర్యకుమార్ యాదవ్, న్యూజిలాండ్‌లో రెండో టీ20 చేశాడు. తాజాగా శ్రీలంకపై మూడో టీ20 శతకాన్ని నమోదు చేశాడు. మూడు దేశాల్లో మూడు దేశాలపై టీ20 సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు సూర్య...

Suryakumar Yadav

2021లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సూర్యకుమార్ యాదవ్ ఇప్పటిదాకా ఆడింది 43 టీ20 ఇన్నింగ్స్‌లే. అందులో 13 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు బాదాడు సూర్య. 1500+ టీ20 పరుగులు అందుకున్న సూర్య భాయ్... 180+ స్ట్రైయిక్ రేటుతో అదరగొట్టాడు...

Image credit: PTI

తన టీ20 కెరీర్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటిదాకా 875 బంతులు ఎదుర్కోగా అందులో 92 సిక్సర్లు, 142 ఫోర్లు బాదేశాడు. మరో 8 సిక్సర్లు బాదితే టీ20ల్లో 100 సిక్సర్లు పూర్తి చేసుకుంటాడు సూర్యకుమార్ యాదవ్...

Image credit: PTI

అంతర్జాతీయ క్రికెట్‌లో 4 టీ20 సెంచరీలు బాదిన రోహిత్ శర్మ, టాప్‌లో ఉన్నాడు. అయితే రోహిత్ శర్మ ఇప్పటిదాకా 148 మ్యాచులు ఆడితే, సూర్య అందులో 105 మ్యాచులు తక్కువగా ఆడాడు. గ్లెన్ మ్యాక్స్, కోలిన్ మున్రో మూడేసి టీ20 సెంచరీలు బాది సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి రోహిత్ తర్వాతి ప్లేస్‌లో ఉన్నారు...

ఇంగ్లాండ్‌పై 117 పరుగులు చేసి అవుటైన సూర్యకుమార్ యాదవ్, న్యూజిలాండ్‌పై 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంకపై 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీ20ల్లో మూడుసార్లు 110+ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ సూర్యనే...

Image credit: Getty

‘చాలామంది వారి కలలో కూడా సూర్యకుమార్ యాదవ్‌లా బ్యాటింగ్ చేసి ఉండరు...’ అంటూ సూర్య ఇన్నింగ్స్ గురించి ట్వీట్ చేశాడు క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే...  

‘స్కై (SKY -సూర్య ముద్దుపేరు) వేరే లీగ్‌లో ఉన్నాడు. అది తన సొంత లీగ్. సెన్సేషనల్ ఇన్నింగ్స్. ప్రపంచంలోనే ది బెస్ట్ టీ20 బ్యాటర్. అందులో ఎలాంటి సందేహం లేదు...’ అంటూ ట్వీట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

Image credit: Getty

‘సూర్యకుమార్ యాదవ్ ఆరేళ్ల క్రితం ఆరంగ్రేటం చేసి ఉంటే ఎలా ఉండేదో ఊహించుకోండి. అతను రికార్డులన్నీ తిరగేసేవాడా? లేక 30ల్లో ఆరంగ్రేటం చేయడమే సూర్యకి కలిసి వచ్చిందా? ’ అంటూ ట్వీట్ చేశాడు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్...

click me!