ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 77 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ యాదవ్, 10 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలతో 5,326 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 24 వికెట్లు కూడా తీశాడు. అయితే దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షాలను పట్టించుకోని బీసీసీఐ, సూర్యని టెస్టుల్లో ఆడించే సాహసం చేయకపోవచ్చు..