రాహుల్ ద్రావిడ్‌ని ఫాలో అయిన టీమిండియా... వాంఖడే టెస్టు విజయం తర్వాత...

First Published Dec 6, 2021, 3:47 PM IST

హెడ్‌‌కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత జట్టులో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. క్రీజులో వీరావేశంతో ఊగిపోయే విరాట్ కోహ్లీ దగ్గర్నుంచి, సిరాజ్ వరకూ అందరిలోనూ మార్పు కనిపించింది...

ముంబైలో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్‌లో 372 పరుగుల భారీ తేడాతో టెస్టు క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని అందుకుంది భారత జట్టు...

తొలి టెస్టులో ఆఖరి వికెట్‌ తీయలేక విజయాన్ని తృటిలో మిస్ చేసుకున్న టీమిండియా, ముంబై టెస్టులో ప్రత్యర్థిని చిత్తు చేసి 1-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది...

పూర్తిగా ఐదు రోజుల పాటు సాగిన కాన్పూర్ టెస్టు ముగిసిన తర్వాత భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, తన సొంత డబ్బుల నుంచి రూ.35 వేలు, పిచ్ క్యూరేటర్‌కి అందించిన విషయం తెలిసిందే...

ముంబై టెస్టు విజయం తర్వాత టీమిండియా, కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను అనుసరించింది. వాంఖడే టెస్టు విజయం తర్వాత భారత జట్టు సభ్యులు, పిచ్ క్యూరేటర్లకు రూ.35 వేల చెక్‌ను బహుమతిగా అందించారు.

కాన్పూర్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు... టెస్టు క్రికెట్ మజాను మరోసారి పరిచయం చేసింది. పూర్తిగా ఐదు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒకే ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని కోల్పోవాల్సి వచ్చింది...

ఐదో రోజు ఆఖరి సెషన్‌లో చివరి అరగంట వికెట్లకు అడ్డుగా నిలబడి, టీమిండియాకి విజయాన్ని దూరం చేశారు న్యూజిలాండ్ ప్లేయర్లు రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్...

ముంబై టెస్టులో ఈ ఇద్దరే భారత జట్టును ఇబ్బంది పెట్టడం మరో విశేషం. అజాజ్ పటేల్ తొలి ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసి, టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 7 వికెట్లు కోల్పోగా, అందులో అజాజ్ పటేల్ 4, రచిన్ రవీంద్ర మూడు వికెట్లు తీయడం విశేషం. న్యూజిలాండ్ స్టార్ పేసర్లు టిమ్ సౌథీ, కేల్ జెమ్మీసన్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. 

click me!