పాక్ కంటే ఘోరంగా! టీమిండియా ఫీల్డింగ్‌పై ఫోకస్ పెట్టని రాహుల్ ద్రావిడ్... రవిశాస్త్రి చాలా బెటర్ అంటూ...

First Published Dec 5, 2022, 10:10 AM IST

పాకిస్తాన్ క్రికెట్ జట్టు చేసే ఫీల్డింగ్ పొరపాట్లను ఎత్తి చూపిస్తూ,  వాళ్ల క్యాచ్ డ్రాప్‌లపై రీల్స్ చేసి...  ట్రోల్ చేస్తూ నవ్వుకోవడం టీమిండియా ఫ్యాన్స్‌కి  బాగా అలవాటు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. భారత జట్టు, పాక్ కంటే ఘోరంగా ఫీల్డింగ్‌లో ఫెయిల్ అవుతూ నవ్వులపాలవుతోంది. కెప్టెన్‌, హెడ్ కోచ్ మారిన తర్వాత భారత జట్టు... ఫీల్డింగ్‌ విభాగాన్ని  పట్టించుకుంటున్నట్టు అస్సలు కనిపించడం లేదు..

గత ఏడాదిన్నరగా భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టూర్‌లలో కళ్లు చెదిరే క్యాచులు, డ్రైవ్ చేస్తూ ఫీల్డింగ్ విన్యాసాలు చేసి విజయాలు అందుకున్న టీమిండియా... ఇప్పుడు చేతుల్లోకి వచ్చిన బంతిని అందుకోలేకపోతోంది... టీమిండియా వైఫల్యానికి ఫీల్డింగ్ ఫెయిల్యూర్ కూడా ఓ కారణం...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టు, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. అయితే 18 ఓవర్ల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్లు బాబర్ ఆజమ్- మహ్మద్ రిజ్వాన్ ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. బంతి గాల్లోకి ఎగిరిన సందర్భాలు కానీ, రనౌట్ ఛాన్స్ వదిలేసిన సీన్స్ కానీ ఒక్కటి కూడా లేవు... 

ఆసియా కప్ 2022 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్, శ్రీలంక జట్లతో జరిగిన మ్యాచుల్లో ఓడి, ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది టీమిండియా. అయితే ఈ రెండు మ్యాచుల్లో కలిపి 3 క్యాచులు డ్రాప్ చేసిన భారత ఫీల్డర్లు, మిస్ ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి జట్లకు అదనపు పరుగులు అందించారు...

KL Rahul

తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా చేసిన ఫీల్డింగ్ తప్పిదాలకు భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 9వ వికెట్ పడిన తర్వాత ఆఖరి వికెట్‌కి 51 పరుగులు జోడించిన మెహిడీ హసన్, టీమిండియాకి విజయాన్ని దూరం చేశాయి. అయితే మెహిడీ హసన్ 43వ ఓవర్‌లో ఇచ్చిన ఈజీ క్యాచ్‌ని డ్రాప్ చేశాడు కెఎల్ రాహుల్...

గాల్లోకి ఎగిరి కెఎల్ రాహుల్ గ్లవ్స్‌లో పడిన బంతి, కిందకి దొర్లుకుంటూ పోయింది. మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్ కంటే ఘోరంగా ఏం జరుగుతుందో అర్థం కానట్టు మొద్దుబారి నిల్చుండిపోయాడు రాహుల్...  దీంతో ‘లగాన్’ సినిమాలో పల్లెటూరి వ్యక్తి క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించి మిస్ చేసినట్టు, కెఎల్ రాహుల్ క్యాచ్ డ్రాప్ చేశాడని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు..

Ravi Shastri and Virat Kohli

బ్యాటుతో 73 పరుగులు చేసి టీమిండియాని బ్యాటుతో ఆదుకున్న రాహుల్, క్యాచ్ డ్రాప్‌తో మళ్లీ ట్రోలింగ్‌ని ఫేస్ చేస్తున్నాడు. ఆ తర్వాతి బంతికి మెహిడి హసన్ కొట్టిన షాట్ మరోసారి గాల్లోకి లేచింది. అయితే థర్డ్ మ్యాన్ పాయింట్‌లో ఉన్న వాషింగ్టన్ సుందర్, క్యాచ్ కోసం ప్రయత్నించలేదు. దీంతో మరోసారి బతికిపోయిన హసన్, టీమిండియా నుంచి విజయాన్ని దూరం చేశాడు.

Image credit: Getty

రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియా బ్యాటింగ్ విభాగం ఫెయిల్ అయినా బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో దుమ్మురేపింది...  కోహ్లీతో పాటు రహానే, పూజారా, ధావన్ వంటి బ్యాటర్లు ఫెయిల్ అయినా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది బౌలింగ్, ఫీల్డింగే!  కానీ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు తీసుకున్నాక పూర్తిగా బ్యాటింగ్ విభాగంపైనే ఫోకస్ పెట్టాడని.. అందుకే బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో టీమిండియా అట్టర్ ఫ్లాప్ అవుతోందని ఆరోపిస్తున్నారు భారత అభిమానులు... 

రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నాడు ఆర్ శ్రీధర్. రవిశాస్త్రితో కలిసి పని చేసిన బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అండ్ కో... కోచింగ్ స్టాఫ్‌గా కొనసాగడానికి ఇష్టపడలేదు. అయితే శ్రీధర్ మాత్రమే రాహుల్ ద్రావిడ్ కోచింగ్ స్టాఫ్‌లోనూ సభ్యుడిగా చేరాడు. 

Image credit: PTI

అదే ఫీల్డింగ్ కోచ్ ఉన్నా టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలు పడిపోయాయంటే అది హెడ్ కోచ్, కెప్టెన్ చేస్తున్న తప్పే! బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ కోసం కేటాయిస్తున్న సమయం, ఫీల్డింగ్ కోసం కేటాయించడం లేదని, కేవలం నామమాత్రం భారత జట్టు క్యాచ్ ప్రాక్టీస్ చేస్తోందనే ఆరోపణలు చేస్తున్నారు అభిమానులు. 

click me!