అంతటిరి! ఇంతటిరి.. ఆఖరికి బంగ్లాపై కూడా ఓడిపోతిరి... రోహిత్ కెప్టెన్సీని ట్రోల్ చేస్తున్న కోహ్లీ ఫ్యాన్స్..

First Published Dec 5, 2022, 9:22 AM IST

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ సారథిగా రికార్డు స్థాయిలో 8 సీజన్లలో ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ కెప్టెన్సీ రికార్డే, అతన్ని టీమిండియా కెప్టెన్‌ని చేసింది. అయితే కారణం ఏదైనా రోహిత్ శర్మ కెప్టెన్‌ అయ్యాక టీమిండియాకి ఏదీ పెద్దగా కలిసి రావడం లేదు...

Rohit Sharma

రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క ఏడాదిలో 8 మంది కెప్టెన్లను మార్చాల్సి వచ్చింది టీమిండియా... రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్... ఇలా సిరీస్‌కో కెప్టెన్‌ని మారుస్తూ చేసిన చెత్త ప్రయోగాలు టీమ్‌ని తీవ్రంగా దెబ్బ తీశాయి...

ఒక్క హార్ధిక్ పాండ్యా తప్ప మిగిలిన కెప్టెన్లు టీమ్‌కి పెద్దగా విజయాలను అందించలేకపోయారు. రాహుల్ కెప్టెన్సీలో సౌతాఫ్రికాలో వన్డే సిరీస్‌ని 3-0 తేడాతో కోల్పోయిన భారత జట్టు, బుమ్రా కెప్టెన్సీలో ఇంగ్లాండ్ టూర్‌లో ఐదో టెస్టు ఆడి విజయాన్ని అందుకోలేకపోయింది...

Image credit: PTI

రోహిత్ ద్వైపాక్షిక సిరీసుల్లో వరుస విజయాలు అందుకున్నా... కీలక టోర్నీల్లో విఫలమవుతూ వచ్చాడు. టైటిల్ ఫెవరెట్‌గా ఆసియా కప్ 2022 టోర్నీని ఆరంభించిన భారత జట్టు, సూపర్ 4 రౌండ్ నుంచే ఇంటిదారి పట్టింది. హాట్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా టీ20 వరల్డ్ కప్ 2022 ఆడి, సెమీ ఫైనల్ నుంచే నిష్కమించింది..

తాజాగా బంగ్లాదేశ్ పర్యటనలో జరిగిన తొలి వన్డేలో ఒక్క వికెట్ తేడాతో పరాజయాన్ని మూటకట్టుకుంది రోహిత్ సేన... బంగ్లాదేశ్‌పై వన్డే, టీ20 మ్యాచుల్లో పరాజయాన్ని చవిచూసిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు రోహిత్ శర్మ...

Image credit: PTI

136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్, ఆఖరి వికెట్‌కి 51 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి చారిత్రక విజయాన్ని అందుకుంది. కెప్టెన్‌గా 2019లో బంగ్లాపై టీ20 మ్యాచ్ ఓడిన రోహిత్, 2022లో వన్డేలోనూ ఓడాడు...

Image credit: PTI

కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా ఈ ఏడాది రోహిత్ శర్మ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 3 టెస్టులు ఆడి 90 పరుగులు చేసిన రోహిత్ శర్మ,6 వన్డేల్లో 171 పరుగులు చేశాడు. 29 టీ20ల్లో 656 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా ఈ ఏడాది 38 మ్యాచుల్లో రోహిత్ శర్మ 50+ స్కోర్లు చేసింది ఐదు సార్లు మాత్రమే..

Rohit Sharma laugh

ఐపీఎల్ రికార్డు చూసి, టీమిండియాకి ఐసీసీ టైటిల్ అందివ్వగల సత్తా ఉన్న కెప్టెన్‌గా రోహిత్ శర్మను చూశారు అభిమానులు, బీసీసీఐ పెద్దలు... అయితే ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్సీ చేయడం, టీమిండియా నడిపించడం రెండూ ఒక్కటి కాదని రోహిత్ నిరూపిస్తున్నాడని ట్రోల్ చేస్తున్నారు కోహ్లీ అభిమానులు...

Image credit: PTI

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ గెలవకపోవచ్చు కానీ మరీ ఇలా బంగ్లాదేశ్, శ్రీలంక వంటి జట్లపై ఓడిపోయింది లేదని... రోహిత్ శర్మ కెప్టెన్సీ ఫెయిల్యూర్‌ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ 2023 ఆడితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ శాంపిల్‌ ద్వారా అర్థమవుతోందని విమర్శిస్తున్నారు. 

click me!