వారి వల్లే మా ఇద్దరి మధ్య చెడింది.. రుతురాజ్ నాతో మాట్లాడటం లేదు.. సీఎస్కే ఓపెనర్‌తో రిలేషన్‌‌పై సయాలీ..

Published : Dec 04, 2022, 04:18 PM IST

Ruturaj Gaikwad - Sayali Sanjeev: టీమిండియా యువ బ్యాటర్, దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ మరాఠీ నటి సయాలీ  సంజీవ్ తో  రిలేషన్ లో ఉన్నాడని గతంలో గుసగుసలు వినిపించాయి. తాజాగా ఈ విషయమై స్వయంగా సయాలీనే ఓపెన్ అయింది. 

PREV
18
వారి వల్లే మా ఇద్దరి మధ్య చెడింది.. రుతురాజ్ నాతో మాట్లాడటం లేదు.. సీఎస్కే ఓపెనర్‌తో రిలేషన్‌‌పై సయాలీ..

ఐపీఎల్ 2021  సీజన్ లో  చెన్నై సూపర్ కింగ్స్ తరఫున  మెరుపులు మెరిపించి తర్వాత దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న  మహారాష్ట్ర బ్యాటర్  రుతురాజ్ గైక్వాడ్ ఇటీవలే ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల పండుగ చేసుకున్నాడు.  క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ లో శతకాల మోత మోగించాడు. 

28

దేశవాళీలో రాణిస్తున్న  రుతరాజ్ కు టీమిండియాలో చోటు దక్కినా  అతడు దానిని సద్వినియోగం చేసుకోలేదు. అయితే 2021 ఐపీఎల్ తర్వాత రుతురాజ్.. ప్రముఖ మరాఠీ నటి సయాలీ సంజీవ్ తో  డేటింగ్ చేస్తున్నాడని  గుసగుసలు వినిపించాయి. ఈ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు  సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.  మరో సినీ-క్రికెట్ జంట గురించి బాలీవుడ్  తో పాటు క్రికెట్ వర్గాలలో జోరుగా చర్చలు నడిచాయి. 

38

అయితే తమ మధ్య స్నేహం తప్ప మరోకొటి లేదని  అంటున్నది సయాలీ. తాజాగా ఆమె  రుతురాజ్ తో తన రిలేషన్‌షిప్  గురించి ఓపెన్ అయింది.  రుతురాజ్ కు తనకు నడుమ లవ్ లేదని, తాము డేటింగ్ చేయలేదని అవన్నీ రూమర్లేనని కొట్టిపడేసింది.  

48

సయాలీ మాట్లాడుతూ.. ‘మా మధ్య ఏమీలేదు.  మేం డేటింగ్ చేసుకున్నామని రూమర్స్ ప్రచారం చేశారు. వాటి వల్ల మా స్నేహం కూడా దెబ్బతింది. ఆ రూమర్స్ వల్ల మేం ఇప్పుడు కనీసం ఫ్రెండ్స్ గా కూడా మాట్లాడుకోవడం లేదు. అసలు మా ఇద్దరి మధ్య ఈ రూమర్స్ ఎందుకు  సృష్టించారో కూడా నాకు తెలియదు...

58

గాసిప్స్ సృష్టించేవాళ్లకు వాటి తర్వాత పరిణామాలు ఏంటో తెలియవు. ఈ రూమర్స్ వల్ల మా వ్యక్తిగత జీవితాల మీద చాలా ప్రభావం పడింది. రుతురాజ్ మంచి ఆటగాడు.   మొదట మేమిద్దరం కూడా ఈ రూమర్స్ ను పెద్దగా పట్టించుకోలేదు.  ఇవన్నీ పనికిమాలిన వాళ్లు చేసే పని అని సర్దిపెట్టుకున్నాం. 

68

వాస్తవానికి  మా ఇద్దరి మధ్య ఏదైనా ఉంటే అది బయటకు వస్తుంది కదా.  అదీగాక  నేను ఎవరినైనా పెళ్లి  చేసుకున్నా, రుతురాజ్ ఎవరిని చేసుకున్నా అది అందరికీ తెలుస్తుంది కదా.  కానీ  రెండున్నర సంవత్సరాల కింది నుంచే మా ఇద్దరి మీద రూమర్స్  వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. 

78

ఇంట్లో కూర్చుని ఇలాంటి పనికిమాలిన రూమర్స్ క్రియేట్  చేసేవారి వల్ల నేను ఇప్పుడు కనీసం రుతురాజ్ నువ్వు బాగా ఆడావ్.. ఇవాళ నువ్వు ఆడలేదు.. అని  చెప్పలేకపోతున్నా. నా గురించి కూడా  అతడు ఏమీ చెప్పడం లేదు. దీనికంతటికీ కారణం రూమర్సే...’అని స్పష్టతనిచ్చింది.  

88

సోషల్ మీడియాలో సయాలీ పెట్టిన  పోస్టులకు రుతురాజ్   లైకులు కొట్టడం, కామెంట్స్ చేయడంతో  ఈ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఉందని, డేటింగ్ చేస్తున్నారని వార్తలు వినిపించాయి. కానీ వారి  లవ్ గురించి గానీ, ఫ్రెండ్షిప్ గురించి గానీ ఈ ఇద్దరూ ఏనాడూ బయట బహిరంగంగా ఓపెన్ అవలేదు. తాజాగా  సయాలీ మాత్రం తమ మీద రూమర్స్ క్రియేట్ చేసేవారిపై  ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. 

click me!

Recommended Stories