మాహీ స్టేడియానికి వస్తే మ్యాచ్ పోయినట్టే... మూడో టీ20లో టీమిండియా ఓటమితో ధోనీపై ట్రోల్స్...

First Published Jul 11, 2022, 1:36 PM IST

అక్కడెక్కడో సామ్ కుర్రాన్ సెంచరీ కొట్టినా, మొయిన్ ఆలీ వికెట్లు తీసినా... జోష్ హజల్‌వుడ్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చినా దానికి ఎమ్మెస్ ధోనీయే కారణమంటారు మాహీ అభిమానులు. దీనికి కౌంటర్‌గా మాహీని విమర్శించేందుకు అవకాశాల కోసం వెతుకుతూ ఉంటారు ధోనీ హేటర్స్...

MS Dhoni

బర్త్ డే, మ్యారేజ్ డే సెలబ్రేషన్స్‌ కోసం లండన్ వెళ్లిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ట్రెంట్ బ్రిడ్జీలో జరిగిన ఇండియా, ఇంగ్లాండ్ మూడో టీ20కి హాజరయ్యాడు... 

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాస్కులో స్టేడియానికి వచ్చి అభిమానులకు సెల్పీలు ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఇషాన్ కిషన్, దీపక్ హుడా వంటి ప్లేయర్లతో మాట్లాడాడు... 
 

Latest Videos


Image credit: BCCI

మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కామెంటరీ బాక్సులో ఉన్న భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి కాసేపు ముచ్చటించాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఈ సమయంలో టీవీ కెమెరాలన్నీ మాహీ మీదే ఫోకస్ పెట్టాయి...

అయితే మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగినా 216 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 198 పరుగులకు పరిమితమై 17 పరుగుల తేడాతో ఓడింది భారత జట్టు... టీమిండియా ఓటమికి మాహీయే కారణమంటున్నారు అభిమానులు...

Image credit: Getty

దీనికి కారణం లేకపోలేదు... 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టుకి మెంటర్‌గా వ్యవహరించాడు మహేంద్ర సింగ్ ధోనీ. మాహీ లేకుండా మొట్టమొదటిసారి పొట్టి ప్రపంచకప్ ఆడుతున్న భారత జట్టుకి ధోనీ విలువైన సలహాలు ఇస్తాడనే ఉద్దేశంతో అతన్ని మెంటర్‌గా నియమించింది బీసీసీఐ...

వార్మప్ మ్యాచుల్లో బౌండరీ లైన్ దగ్గరే రిషబ్ పంత్ వంటి ప్లేయర్లకు సలహాలు ఇస్తూ, టెక్నిక్‌లు నేర్పిస్తూ తెగ హడావుడి చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఆ సమయంలో భారత జట్టులో ఏ ప్లేయర్ అదరగొట్టినా అంతా మాహీ మహిమేనంటూ ఆకాశానికి ఎత్తేశారు కామెంటేటర్లు...

టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి, ఆ సమయంలో ఏ పని లేనట్టు ఖాళీగా కనిపించాడు. అయితే మాహీ మెంటర్‌గా వ్యవహరించిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో తొలిసారి పాక్ చేతుల్లో పరాజయం చవిచూసిన భారత జట్టు, న్యూజిలాండ్ చేతుల్లో ఓడి గ్రూప్ స్టేజీకే పరిమితమైంది...

న్యూజిలాండ్ చేతుల్లో భారత జట్టు పరాజయం తర్వాత మాహీ హడావుడి పూర్తిగా తగ్గిపోయింది. టీమిండియా ఓటమికి మాహీయే కారణమంటూ ట్రోల్స్ వినిపించాయి. మరోసారి మాహీ స్టేడియంలో కనిపించిన మ్యాచ్‌లో భారత జట్టుకి పరాజయం ఎదురుకావడంతో ఈసారి కూడా ధోనీని టార్గెట్ చేస్తున్నారు కొందరు యాంటీ ఫ్యాన్స్...

టీమిండియా ఓటమితో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా మరోసారి ట్రోలింగ్ ఎదుర్కొంటూ, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ...

click me!