2007 టీ20 వరల్డ్‌కప్‌లో చేసిందే, 2022లోనూ చేస్తే... కోహ్లీ, రోహిత్, జడ్డూలను పక్కనబెట్టి...

Published : May 18, 2022, 03:24 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీని టైటిల్ ఫెవరెట్‌గా ఆరంభించింది టీమిండియా, అయితే రిజల్ట్ మాత్రం అనుకున్నట్టుగా రాలేదు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు ఐపీఎల్‌లో సీనియర్ల పర్ఫామెన్స్ చూస్తుంటే, ఈ సారి కూడా తేడా కొట్టేస్తుందేమోననే భయాలు రేగుతున్నాయి...

PREV
110
2007 టీ20 వరల్డ్‌కప్‌లో చేసిందే, 2022లోనూ చేస్తే... కోహ్లీ, రోహిత్, జడ్డూలను పక్కనబెట్టి...

టీమిండియాకి కీలక ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ... ఐపీఎల్ 2022 సీజన్‌లో ఒక్కటంటే ఒక్క ఇన్నింగ్స్ కూడా వాళ్ల స్థాయికి తగ్గది ఆడలేకపోయారు. రోహిత్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు, విరాట్ ఓ హాఫ్ సెంచరీ చేసినా టీ20ల్లో వన్డేలా ఆడాడు...

210

భారత ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రా 13 మ్యాచుల్లో 12 వికెట్లు పడగొట్టాడు పర్వాలేదనిపించాడు. అయితే ఇందులో కేకేఆర్‌పై తీసిన 5 వికెట్లు తీస్తే, మిగిలిన 12 మ్యాచుల్లో తీసింది 7 వికెట్లు మాత్రమే...

310
Ravindra Jadeja

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఐపీఎల్ 2022 సీజన్‌ని ఆరంభించిందిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, అట్టర్ ఫ్లాప్ పర్పామెన్స్ ఇచ్చాడు. దీంతో సీనియర్లను తప్పించి, 2007 టీ20 వరల్డ్‌కప్ ఫార్ములాని ఇప్పుడు ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు నెటిజన్లు...

410

2007 వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌ చేతుల్లో ఘోర పరాభవం తర్వాత జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2007 టోర్నీలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, సౌరవ్ గంగూలీ వంటి సీనియర్లు పాల్గొనలేదు..

510

వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు రోహిత్ శర్మ, శ్రీశాంత్, రాబిన్ ఊతప్ప, యువరాజ్ సింగ్, ఎమ్మెస్ ధోనీ, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అజిత్ అగార్కర్, జోగిందర్ శర్మ వంటి యువకులతో ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీని ఆరంభించిన భారత జట్టు, ఫైనల్‌లో పాకిస్తాన్‌ని ఓడించి... మొట్టమొదటి పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిచింది...

610

సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్‌ల అనుభవంలో పదో వంతు అంతర్జాతీయ అనుభవం కూడా లేని కుర్రాళ్లు, పొట్టి ప్రపంచకప్‌లో చెలరేగిపోయారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి టాప్ టీమ్స్‌కి చుక్కలు చూపించారు...

710

ఇప్పుడు కూడా టీమిండియా పరిస్థితి దాదాపు సేమ్. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది భారత జట్టు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, అసలు ఆడాలనే ఆసక్తి లేనట్టుగా ఆడారు భారత ప్లేయర్లు...

810
Rishabh Pant, Rohit Sharma

కాబట్టి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి కుర్రాళ్లతో కూడిన జట్టును పంపాలని అంటున్నారు నెటిజన్లు. అప్పుడు ఎమ్మెస్ ధోనీని కెప్టెన్‌గా చేసినట్టు, ఇప్పుడు రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని సలహాలు ఇస్తున్నారు...

910

రిషబ్ పంత్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్, మోహ్సీన్ ఖాన్, ఆవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్ వంటి కుర్రాళ్లతో నిండిన టీమ్‌ని టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి పంపాలని సూచిస్తున్నారు...

1010

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో విరాట్, రోహిత్, బుమ్రా, జడేజా, షమీ వంటి మ్యాచ్ విన్నర్లను పక్కనబెట్టి, కొత్త కుర్రాళ్లతో నిండిన జట్టును టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి పంపే సాహసం బీసీసీఐ కలలో కూడా చేయకపోవచ్చు...

Read more Photos on
click me!

Recommended Stories