ఉమ్రాన్ మాలిక్ మామూలు ఫామ్‌లో లేడుగా... జస్ప్రిత్ బుమ్రా రికార్డునే బ్రేక్ చేసి...

Published : May 18, 2022, 01:21 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌కే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయాడు ఉమ్రాన్ మాలిక్. 150+ కి.మీ.ల వేగంతో మెరుపు బౌలింగ్ చేస్తూ మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ విశ్లేషకుల మన్ననలు కూడా అందుకున్న ఉమ్రాన్ మాలిక్, రెండో సీజన్‌లోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు...

PREV
16
ఉమ్రాన్ మాలిక్ మామూలు ఫామ్‌లో లేడుగా... జస్ప్రిత్ బుమ్రా రికార్డునే బ్రేక్ చేసి...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా 13 మ్యాచులు ఆడిన ఉమ్రాన్ మాలిక్, 47 ఓవర్లు బౌలింగ్ చేసి 21 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మ్యాచ్‌లో 4 వికెట్లు, మరో మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాడు ఉమ్రాన్ మాలిక్...

26

పర్పుల్ క్యాప్ రేసులో యజ్వేంద్ర చాహాల్ 24 వికెట్లు, వానిందు హసరంగ 23 వికెట్లు, కగిసో రబాడా 12 మ్యాచుల్లో 22 వికెట్ల తర్వాతి స్థానంలో ఉన్న ఉమ్రాన్ మాలిక్.. మహా అయితే మరో మ్యాచ్ మాత్రమే ఆడతాడు...

36

ఐపీఎల్ 2022 సీజన్‌లో 7 మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాలంటే మిగిలిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించడంతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు పంజాబ్ కింగ్స్, కేకేఆర్ వంటి జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది...

46

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లో 15 పరుగులు ఇచ్చిన ఉమ్రాన్ మాలిక్, ఆ తర్వాత 2 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు...

56

ఐపీఎల్‌లో అతి పిన్న వయసులో ఒకే సీజన్‌లో 20 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఉమ్రాన్ మాలిక్. 2017లో ముంబై ఇండియన్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన జస్ప్రిత్ బుమ్రా, 23 ఏళ్ల 165 రోజుల వయసులో ఐపీఎల్‌ 2017లో 20 వికెట్లు పడగొట్టాడు...

66

22 ఏళ్ల 176 రోజుల వయసున్న ఉమ్రాన్ మాలిక్, జస్ప్రిత్ బుమ్రా రికార్డును అధిగమించి అతి పిన్న వయసులో ఒకే సీజన్‌లో 20 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు... 

click me!

Recommended Stories