ధోనీ వచ్చి మాత్రం ఏం చేశాడు, చెన్నైకి కప్పు తెచ్చాడా?... మాహీపై హర్భజన్ సింగ్ కామెంట్...

First Published May 18, 2022, 2:21 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో ఎన్ని అలజడులు, మార్పులు జరిగాయో, 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌లో అన్ని రకాల మార్పులు, అలజడులు చూస్తున్నారు అభిమానులు... సీజన్ ఆరంభానికి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ మాహీ తీసుకున్న నిర్ణయం నుంచి మొదలైన రచ్చ, ఇంకా కొనసాగుతూనే ఉంది...

మాహీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకోవడంతో రవీంద్ర జడేజా కెప్టెన్‌గా ఐపీఎల్ 2022 సీజన్‌ని ప్రారంభించింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే గత సీజన్‌లో సీఎస్‌కే విజయాల్లో కీలక పాత్ర పోషించిన దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్, సురేష్ రైనా, ఫాఫ్ డుప్లిసిస్ లేకపోవడంతో ఆ జట్టు వరుస పరాజయాలు అందుకుంది...

Ravindra Jadeja

కెప్టెన్సీ ప్రెషర్‌తో తన సహజమైన ఆటతీరులో దూకుడుగా ఆడలేకపోయిన రవీంద్ర జడేజా, సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికే 8 మ్యాచుల్లో ఆరింట్లో ఓడిన సీఎస్‌కే, రెండే మ్యాచులు గెలిచింది...

Latest Videos


అయితే అప్పటికీ మిగిలిన 6 మ్యాచుల్లో 5 గెలిచినా చెన్నై సూపర్ కింగ్స్‌కి ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండేవి. అయితే ఎమ్మెస్ ధోనీ తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా సీఎస్‌కే విజయాల బాట పట్టలేకపోయింది...

మాహీ కెప్టెన్సీలో ఇప్పటిదాకా 5 మ్యాచులు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్, 2 విజయాలు మాత్రమే అందించగలిగాడు. ఐపీఎల్ కెరీర్‌లో మొదటిసారి చెన్నై, 9 పరాజయాలు చవిచూసింది...

‘మాహీ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా చెన్నై సూపర్ కింగ్స్‌కి పెద్దగా ఒరిగిందేమీ లేదు. ధోనీ రాగానే చెన్నై సూపర్ విజయాలతో టాప్ పొజిషన్‌లోకి వచ్చేసిందా...

కెప్టెన్‌గా ధోనీ రీఎంట్రీ ఇచ్చినా వాళ్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయారు. కారణం వాళ్లకి సరైన టీమ్ లేదు. సరైన స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ లేదు...

దీపక్ చాహార్, పవర్ ప్లేలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని కంట్రోల్ చేస్తాడు. అతను గాయం కారణంగా తప్పుకున్నాడు. దీపక్ చాహార్ గాయపడితే, అతని ప్లేస్‌లో ఎవరిని ఆడించాలనే ఆలోచన లేకుండా జట్టుని ఎంచుకున్నారు...

బౌలింగ్ మాత్రమే కాదు, బ్యాట్స్‌మెన్ కూడా స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు. టీమ్ ఇలా ఉంటే, కెప్టెన్ ఎవ్వరైతే మాత్రం, విజయాలు ఎలా సాధించగలుగుతారు...’ అంటూ కామెంట్ చేశాడు సీఎస్‌కే మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...

click me!