ఈ మాత్రం దానికి ఓటింగ్ దేనికి! సామ్ కుర్రాన్‌కి మ్యాన్ ఆఫ్ ది టోర్నీ దక్కడంపై...

First Published | Nov 13, 2022, 6:02 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఘనంగా ముగిసింది. మొదటి మ్యాచ్ నుంచి ఉత్కంఠభరితంగా సాగిన టోర్నీలో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. లక్కీగా సెమీస్ చేరిన పాకిస్తాన్, ఫైనల్‌లో ఇంగ్లాండ్‌కి గట్టి పోటీ ఇచ్చినా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు.. వెస్టిండీస్ తర్వాత ఈ ఫీట్ సాధించిన జట్టుగా నిలిచింది...

Image credit: Getty

టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కూడా కైవసం చేసుకున్నాడు. టోర్నీలో 13 వికెట్లు తీసిన సామ్ కుర్రాన్, ఇంగ్లాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు...

Sam Curran

పురుషుల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ‘మ్యాన్ ఆఫ్ ది ఫైనల్’, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ టైటిల్స్ గెలిచిన మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచాడు సామ్ కుర్రాన్. ఇంతకుముందు ఏ ప్లేయర్ కూడా ఈ రెండు అవార్డులు ఒకేసారి గెలవలేకపోయారు...  ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి రాకుండా ‘ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్’ గెలిచిన మొట్టమొదటి ప్లేయర్‌గానూ నిలిచాడు సామ్ కుర్రాన్...


Sam Curran

2007లో ఇర్ఫాన్ పఠాన్, 2008లో షాహీద్ ఆఫ్రిదీ, 2010లో క్రెగ్ కెస్వీట్టర్, 2012లో మార్లోన్ శామ్యూల్స్, 2014లో కుమార సంగర్కర, 2015లో మార్లోన్ శామ్యూల్స్, 2021లో మిచెల్ మార్ష్... టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్’ గెలిచారు. ఇర్ఫాన్ పఠాన్ తర్వాత  ఈ అవార్డు గెలిచిన లెఫ్టార్మ్ పేసర్‌గా నిలిచాడు సామ్ కుర్రాన్...

2007లో షాహీన్ ఆఫ్రిదీ, 2009లో తిలకరత్నే దిల్షాన్, 2010లో కేవిన్ పీటర్సన్, 2012లో షేన్ వాట్సన్, 2014, 2016 టోర్నీల్లో విరాట్ కోహ్లీ, 2021లో డేవిడ్ వార్నర్.. టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డులు గెలిచారు... కేవిన్ పీటర్సన్ తర్వాత ఈ అవార్డు గెలుచుకున్న రెండో ఇంగ్లాండ్ ప్లేయర్ సామ్ కుర్రాన్...

Sam Curran

సామ్ కుర్రాన్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ ఇవ్వడంపై టీమిండియా ఫ్యాన్స్ అభ్యంతరం తెలుపుతున్నారు. కారణం టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన 9 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేసింది ఐసీసీ. వీరికి ఆన్‌లైన్ ద్వారా ఓటింగ్ నిర్వహించింది...

Sam Curran

ఈ ఓటింగ్‌ ప్రకారం చూస్తుంటే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో 296 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ లేదా, 180+ స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్‌కి ఎక్కువ ఓట్లు వచ్చి ఉంటాయనేది టీమిండియా ఫ్యాన్స్ వాదన. ఈ షార్ట్ లిస్టులో సామ్ కుర్రాన్ ఉన్నప్పటికీ అతనికి 10 శాతం ఓట్లు కూడా వచ్చేది అనుమానమే...

Sam Curran

ఇంగ్లాండ్ టీ20 వరల్డ్ కప్ గెలవడంలో సామ్ కుర్రాన్ పాత్ర కూడా చాలా తక్కువ. ఫైనల్‌తో పాటు అంతకుముందు ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 2 వికెట్లు తీయడం తప్ప పెద్దగా మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్ కూడా ఇవ్వలేదు సామ్ కుర్రాన్... అలాంటప్పుడు సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీలను కాదని సామ్ కుర్రాన్‌కి ఎలా ఇస్తారనేది టీమిండియా ఫ్యాన్స్ వాదన...

Latest Videos

click me!