ఓడినా పాక్ బౌలింగ్ భళా! ఒక్క వికెట్ తీయలేని మనోళ్ల కంటే చాలా బెటర్‌... షాహీన్ గాయపడకపోయుంటే...

First Published | Nov 13, 2022, 5:39 PM IST

క్రికెట్ ఫ్యాన్స్‌కి టన్నుల్లో ఎంటర్‌టైన్‌మెంట్ అందించిన టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ అంతే ఘనంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్, పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచి రెండోసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ఓడినా పాకిస్తాన్ బౌలర్లు చూపించిన పోరాటం, క్రికెట్ ఫ్యాన్స్ మనసులు గెలుచుకుంది...

సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 168 పరుగుల స్కోరు చేసింది. అయితే ఈ స్కోరును కాపాడుకోవడంలో భారత బౌలర్లు ఏ దశలోనూ పోరాటం చూపించలేకపోయారు. తొలి ఓవర్ వేసిన భువీ 3 ఫోర్లతో 13 పరుగులు సమర్పించడంతో మొదలైన పరుగుల ప్రవాహానికి ఎక్కడా అడ్డుకట్ట వేయలేకపోయారు భారత బౌలర్లు...

170 పరుగులనే వికెట్ కోల్పోకుండా కొట్టినవాళ్లకి 138 పరుగుల టార్గెట్ పెద్ద లెక్కా? అనుకున్నారు ఫైనల్ మ్యాచ్ చూసిన టీమిండియా ఫ్యాన్స్... 13 ఓవర్లలో ఇంగ్లాండ్ ఊదిపారేస్తుందని ఫిక్స్ అయ్యారు... అయితే తాము వేరు! తమ బౌలింగ్ విధానం వేరని మరోసారి నిరూపించింది పాకిస్తాన్. టీమిండియాపై బౌండరీల వర్షం కురిపించిన అలెక్స్ హేల్స్‌ని ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే పెవిలియన్ చేర్చాడు షాహీన్ ఆఫ్రిదీ...

Latest Videos


నసీం షా వేసిన రెండో ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. అయితే ఆ తర్వాత కూడా పాక్ బౌలర్లు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. హారీస్ రౌఫ్ నాలుగో ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఫిలిప్ సాల్ట్ వికెట్ తీశాడు. పవర్ ప్లేలో 49 పరుగులే ఇచ్చిన పాక్ బౌలర్లు, 3 వికెట్లు తీశారు...

Pakistan vs West Indies

10 ఓవర్లు ముగిసే సమయానికి 77 పరుగులు చేసింది ఇంగ్లాండ్. అయితే ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో 2, 12వ ఓవర్‌లో 3, 13వ ఓవర్‌లో 5, 14వ ఓవర్‌లో 2 పరుగులే ఇచ్చిన పాక్ బౌలర్లు... ఇంగ్లాండ్ టాప్ క్లాస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.  కీలకమైన 11-14 ఓవర్ల మధ్య 12 పరుగులే చేసింది ఇంగ్లాండ్.. ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన షాహీన్ ఆఫ్రిదీ, మొదటి బంతి వేసిన తర్వాత గాయంతో పెవిలియన్ చేరాడు. ఇదే మ్యాచ్‌కి టర్నింగ్ పాయింట్‌కి మారింది...
 

world cup

షాహీన్ ఆఫ్రిదీ ఓవర్‌ని ఫినిష్ చేసిన ఇఫ్తికర్ అహ్మద్, ఐదు బంతుల్లో 13 పరుగులు ఇచ్చాడు. ఇక్కడే మ్యాచ్ పాక్ బౌలర్ల నుంచి చేజారింది. ఆ తర్వాతి ఓవర్‌లో మొయిన్ ఆలీ 3 ఫోర్లు బాదడంతో 16 పరుగులు వచ్చేశాయి. మ్యాచ్ ఇంగ్లాండ్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది...

పాక్ బ్యాటర్లు మరో 20 పరుగులు చేసి ఉంటే వాళ్లకున్న బౌలింగ్ యూనిట్‌కి రిజల్ట్ మారిపోయి ఉండేది. కనీసం షాహీన్ ఆఫ్రిదీ తన కోటాలోని మిగిలిన రెండు ఓవర్లు పూర్తి చేసినా.. పాకిస్తాన్ రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచేదేమో. మొత్తానికి భారత బౌలింగ్ యూనిట్ కంటే పాక్ బౌలింగ్ యూనిట్ టాప్ క్లాస్ అని మరోసారి నిరూపితమైంది...

Mohammad Wasim Jr

పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌లో సరైన బ్యాటర్లు లేరు. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ అంటూ మనోళ్లలాగే ద్వైపాక్షిక సిరీసుల్లో పరుగులు చేసి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి వెళ్లిన ప్లేయర్లు తప్ప... మ్యాచ్ విన్నర్లు లేరు. అందుకే ఆసియా కప్ ఫైనల్‌లో కానీ, టీ20 వరల్డ్ కప్‌లో కానీ పాకిస్తాన్ విజయాన్ని అందుకోలేకపోయింది. 

click me!