ఎన్ని ఐసీసీ టోర్నీల్లో ఓడినా మన సెలక్టర్లకు బుద్ధి రాదా? ఐపీఎల్ తప్ప ఇంకేమీ చూడడం లేదా..

Published : Jun 23, 2023, 04:47 PM IST

దశాబ్ద కాలంగా ఐసీసీ టోర్నీల్లో వరుసగా ఫెయిల్ అవుతూ వస్తోంది భారత క్రికెట్ జట్టు. వరుసగా రెండు సార్లు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి వెళ్లామని సంతోషించేలోపు, రెండింట్లోనూ విజయాలు అందుకోలేకపోయింది...  

PREV
18
ఎన్ని ఐసీసీ టోర్నీల్లో ఓడినా మన సెలక్టర్లకు బుద్ధి రాదా? ఐపీఎల్ తప్ప ఇంకేమీ చూడడం లేదా..

ఐసీసీ టోర్నీలో టీమ్ వరుసగా విఫలమవుతున్నా సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి బీసీసీఐ, సెలక్టర్లు జంకుతున్నట్టు కనిపిస్తోంది. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 తర్వాత వెస్టిండీస్ టూర్‌కి ఎంపిక చేసిన జట్టులో సర్ఫరాజ్ ఖాన్ పేరు లేకపోవడం మరోసారి బీసీసీఐపై, సెలక్టర్లపై ట్రోలింగ్ రావడానికి కారణమవుతోంది...

28

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 34 మ్యాచులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్, 11 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలతో 3175 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ క్లాస్ కెరీర్ యావరేజ్ 77.43గా ఉంటే గత మూడేళ్లలో అది 90కి పైగా ఉంది...

38
Sarfaraz Khan

2019-20 రంజీ సీజన్‌లో 6 మ్యాచుల్లో 2 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలతో 928 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్, గత 2021-22 సీజన్‌లో 6 మ్యాచులు ఆడి 2 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలతో 982 పరుగులు చేశాడు.

48

ఫస్ట్ క్లాస్ యావరేజ్ విషయంలో సర్ డాన్ బ్రాడ్‌మన్‌తో పోటీపడుతున్న సర్ఫరాజ్ ఖాన్‌ని సెలక్టర్లు ఘోరంగా అవమానిస్తున్నారనేది కాదనరాని నిజం..

58

వెస్టిండీస్ టూర్‌కి ఎంపిక చేసిన జట్టులో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు సెలక్టర్లు. యశస్వి జైస్వాల్ 26 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో 80.21 సగటుతో 1845 పరుగులు చేశాడు. ఈ 21 ఏళ్ల కుర్రాడి దూకుడుని వాడుకోవాలని చూస్తోంది టీమిండియా...

68
Ruturaj Gaikwad

అయితే రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ క్లాస్ సగటు 40 మాత్రమే. ఐపీఎల్ పర్ఫామెన్స్ ఆధారంగా అతనికి వన్డే, టీ20 టీమ్‌లో చోటు కల్పిస్తే పర్లేదు అనుకోవచ్చు కానీ దేశవాళీ టోర్నీల్లో బాగా ఆడుతున్నవారిని కాదని రుతురాజ్ గైక్వాడ్‌ని సెలక్ట్ చేయడానికి ఏ ప్రమాణాన్ని అడ్డుపెట్టుకున్నారో అభిమానులకు తెలియడం లేదు...

78
Abhimanyu Easwaran


సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు అక్షయ్ వాడ్కర్, అభిమన్యు ఈశ్వరన్, రజత్ పటిదార్, షకీబ్ ఉల్ గనీ, హేత్ పటేల్, రింకూ సింగ్ వంటి కుర్రాళ్లు, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రుతురాజ్ గైక్వాడ్ కంటే మెరుగైన ప్రదర్శన ఇస్తున్నారు..

88

అయితే మన సెలక్టర్లు, ఐపీఎల్ మ్యాచులు తప్ప ఫస్ట్ క్లాస్ మ్యాచులు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో వీళ్ల ఆట గురించి తెలియడం లేదు. కేవలం ఐపీఎల్‌లో మెరిసిన ప్లేయర్లకే టీమ్‌లో చోటు దక్కుతోందని మరోసారి నిరూపితమైంది.. 

click me!

Recommended Stories