17 నెలల తర్వాత రీఎంట్రీ, ఆ వెంటనే అజింకా రహానేకి వైస్ కెప్టెన్సీ... ఫ్యూచర్ టెస్టు కెప్టెన్‌‌ అతనేనా?

Published : Jun 23, 2023, 04:19 PM IST

వెస్టిండీస్ టూర్‌లో టెస్టు సిరీస్‌కి  భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ జట్టులో అజింకా రహానేకి మళ్లీ టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ దక్కింది. 17 నెలల క్రితం టీమ్‌కి దూరమైన అజింకా రహానే, రీఎంట్రీలో ఆడింది ఒకే ఒక్క టెస్టు... 

PREV
17
17 నెలల తర్వాత రీఎంట్రీ, ఆ వెంటనే అజింకా రహానేకి వైస్ కెప్టెన్సీ... ఫ్యూచర్ టెస్టు కెప్టెన్‌‌ అతనేనా?

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేసిన అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్‌తో కలిసి 8వ వికెట్‌కి 109 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..
 

27

అప్పుడెప్పుడో 2021 నవంబర్‌లో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో తొలి టెస్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు అజింకా రహానే. గాయంతో రెండో టెస్టు ఆడని అజింకా రహానే, ఆ తర్వాత టెస్టుల్లో వైస్ కెప్టెన్సీని కోల్పోయాడు.

37
Ajinkya Rahane

సౌతాఫ్రికా టూర్ తర్వాత టెస్టుల్లో చోటు కోల్పోయిన అజింకా రహానే, 17 నెలల తర్వాత ఐపీఎల్ 2023 పర్ఫామెన్స్ కారణంగా టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. రహానే రీఎంట్రీకి ప్రధాన కారణం మాత్రం శ్రేయాస్ అయ్యర్ గాయపడడమే..

47
Ajinkya Rahane

శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ ఫిట్‌గా ఉండి ఉంటే అజింకా రహానేకి తిరిగి టెస్టు టీమ్‌లో చోటు కూడా దక్కేది కాదేమో. రీఎంట్రీ తర్వాత ఒకే ఒక్క టెస్టు ఆడిన అజింకా రహానేని తిరిగి టెస్టు వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ..

57

అజింకా రహానే అద్భుతమైన కెప్టెన్. టీమిండియా టెస్టు సారథిగా అతని సత్తా ఏంటో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 చూస్తే తెలుస్తుంది. ఇప్పటిదాకా కెప్టెన్‌గా ఒక్క టెస్టు కూడా ఓడిపోని రహానేకి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం మెచ్చుకోదగ్గదే... కానీ టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ సంగతేంటి?
 

67

రోహిత్ శర్మ వయసు 36 ఏళ్లు. అజింకా రహానే వయసు 35 ఏళ్లు. రోహిత్ త్వరలోనే టెస్టు నుంచి రిటైర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. రహానే మహా అయితే మరో రెండేళ్లు ఆడతాడు. అలాంటిది ఇప్పుడు అతనికి తిరిగి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం అర్థం లేని పని అంటున్నారు విశ్లేషకులు..
 

77
Ajinkya Rahane

వెస్టిండీస్‌లో టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ గాయపడితే కెప్టెన్సీ చేయడానికి అజింకా రహానేకి వైస్ కెప్టెన్సీ ఇచ్చినట్టు తెలుస్తున్నా, శుబ్‌మన్ గిల్ వంటి కుర్రాడికి ఆ బాధ్యత అప్పగించి ఉంటే... ఫ్యూచర్ టెస్టు సారథిని పరీక్షించేందుకు ఈ సిరీస్ ఉపయోగపడేదని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.. 

Read more Photos on
click me!

Recommended Stories