రోహిత్ శర్మ ఎంట్రీకి 16 ఏళ్లు... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీతో హిట్ మ్యాన్ రిటైర్ అవుతాడా...

Published : Jun 23, 2023, 02:31 PM IST

ఒక్కో తరంలో ఒక్కో క్రికెటర్ ఆ తరాన్ని శాసిస్తూ ఉంటాడు. ముందు తరంలో సచిన్ టెండూల్కర్ అయితే, ఈ తరంలో విరాట్ కోహ్లీ! అయితే అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా, ఓ బ్యాటర్, సూపర్ స్టార్‌గా ఎదగడానికి అతనికి మరో మాస్ బ్యాటర్ అవసరం ఉంటుంది. సచిన్‌ టెండూల్కర్ క్లాస్‌కి వీరేంద్ర సెహ్వాగ్ మాస్ బాదుడు కలిసి వస్తే, విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మ హిట్టింగ్ తోడైంది..

PREV
18
రోహిత్ శర్మ ఎంట్రీకి 16 ఏళ్లు... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీతో హిట్ మ్యాన్ రిటైర్ అవుతాడా...
Dhoni-Rohit

2007 జూన్ 23న ఐర్లాండ్‌పై వన్డేల్లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ, 2007 ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో టీ20 ఎంట్రీ ఇచ్చాడు. 2007 టీ20 వరల్డ్ కప్ ఆడిన భారత జట్టులో ఇంకా రిటైర్మెంట్ ప్రకటించని ఒకే ఒక్కడు రోహిత్ శర్మ మాత్రమే..

28
Rohit Sharma

టీమిండియా తరుపున 243 వన్డేలు ఆడిన రోహిత్ శర్మ, 48.63 సగటుతో 9825 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా ఉన్నాడు రోహిత్ శర్మ..

38
Rohit Sharma

టీ20ల్లో నాలుగు అంతర్జాతీయ సెంచరీలు చేసిన రోహిత్ శర్మ, 148 మ్యాచుల్లో 3853 పరుగులు చేశాడు. 2013లో టెస్టుల్లో ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ, 2019లో ఓపెనర్‌గా తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు. 50 టెస్టులు ఆడిన రోహిత్ శర్మ, 3437 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు ఉన్నాయి..

48
Image credit: Getty

కెరీర్ ఆరంభంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా, స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టులో స్థిరమైన చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్ శర్మ, నిలకడలేమి కారణంగా 2011 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు...
 

58

అయితే ఆ తర్వాతే రోహిత్ శర్మ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. 2013 నుంచి రోహిత్ శర్మ తిరుగులేని వైట్ బాల్ బ్యాటర్‌గా రాటుతేలాడు. 2013లో 36 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, 2018లో 74 సిక్సర్లు, 2019లో 78 సిక్సర్లు బాది సంచలనం క్రియేట్ చేశాడు..

68

అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, ఇంగ్లాండ్‌లపై వన్డే, టెస్టు, టీ20ల్లో సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా ఉన్నాడు రోహిత్ శర్మ... మిగిలిన ఏ ప్లేయర్ కూడా మూడు ఫార్మాట్లలో నాలుగు జట్లపై సెంచరీలు చేయలేకపోయారు..

78

రోహిత్ శర్మ 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కాబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 ఫార్మాట్‌కి దూరంగా ఉన్న రోహిత్ శర్మ, వెస్టిండీస్ టూర్‌లో ఆడతాడా? లేదా? అనే విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..

88

కొన్నాళ్లుగా రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో మునుపటి హిట్‌మ్యాన్ దూకుడు కనిపించడం లేదు. అదీకాకుండా గత ఏడాది మెజారిటీ మ్యాచుల్లో రెస్ట్ తీసుకున్న రోహిత్ శర్మ, 2023 వన్డే వరల్డ్ కప్ గెలిచి తన కెరీర్‌ని ఘనమైన ముగించాలని భావిస్తున్నాడట.. 

Read more Photos on
click me!

Recommended Stories