కొందరు అభిమానులు, టీమిండియా క్రికెటర్ల దిష్టిబొమ్మలను రోడ్లపై ఊరేగించి, చెప్పులతో కొడుతూ, రాళ్లు విసురుతూ నిరసనలు వ్యక్తం చేశారు. టీమిండియా క్రికెటర్ల ఆటతీరుపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు... అయితే మరికొందరు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వెళ్లబుచ్చుతున్నారు...
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ ఆడే జట్టు ఎలా ఉండాలో కూడా ఇప్పుడే డిసైడ్ చేస్తున్నారు అభిమానులు. సెలక్టర్లు ఈసారి రిజర్వేషన్ రేషియోలో కాకుండా సత్తా ఉన్న టాలెంటెడ్ కుర్రాళ్లను టీమిండియాకి సెలక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో జట్టు ఎలా ఉండాలో కూడా ఓ లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాతో పాటు రాజస్థాన్ రాయల్స్ యంగ్ ఓపనర్ యశస్వి జైస్వాల్‌కి టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు ఇవ్వాలని సూచిస్తున్నారు అభిమానులు. ఈ ఇద్దరూ పిచ్‌తో సంబంధం లేకుండా, బౌలర్లు ఎవ్వరనేది కూడా చూడకుండా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తారని చెబుతున్నారు టీమిండియా ఫ్యాన్స్...
Image credit: PTI
వన్‌డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్‌ని ఆడించి, టూ డౌన్‌లో సంజూ శాంసన్‌ని బరిలో దింపాలని చెబుతున్నారు. సూర్య, సంజూ శాంసన్ ఇద్దరూ కూడా భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించగలరు. ఈ ఇద్దరూ సెటిల్ అయితే వీరిని అవుట్ చేయడం ఏ బౌలర్‌కైనా చాలా కష్టం... సూర్య అందుబాటులో ఉండకపోతే రాహుల్ త్రిపాఠిని ఆడించాలని సూచిస్తున్నారు.
వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ని, కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాని పెట్టాలని చెబుతున్న అభిమానులు, ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌కి టీమ్‌లో చోటు ఇవ్వాలని సూచిస్తున్నారు. జస్ప్రిత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు ఉమ్రాన్ మాలిక్ కూడా టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉండి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు...
umran malik
స్పిన్నర్‌గా యజ్వేంద్ర చాహాల్‌ని ఆడించాలని చెబుతున్న నెటిజన్లు, రిజర్వు ప్లేయర్లుగా రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, మోహ్సీన్ ఖాన్‌లకు చోటు ఇవ్వాలని సూచిస్తున్నారు. హెడ్ కోచ్‌గా మాత్రం ఆశీష్ నెహ్రాని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు...
మొత్తానికి అభిమానులు కోరుకుంటున్న టీ20 వరల్డ్ కప్ 2024 జట్టు ఇది: పృథ్వీ షా, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా, యజ్వేంద్ర చాహాల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్