దేశం కంటే అదే ముఖ్యమైందా? వన్డే వరల్డ్ కప్ కోసం జస్ప్రిత్ బుమ్రా, ఐపీఎల్‌కి దూరంగా ఉంటాడా...

First Published Jan 10, 2023, 11:11 AM IST

ఐపీఎల్ వచ్చాక క్రికెట్ ఆడే విధానమే పూర్తిగా మారిపోయింది. కొత్త కొత్త రూల్స్‌ని ప్రపంచానికి పరిచయం చేసిన ఐపీఎల్, ఎందరో యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే ఐపీఎల్‌కి వస్తున్న క్రేజ్ కారణంగా టీమిండియాకి ఆడడం కంటే ఫ్రాంఛైజీలకు ఆడడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు క్రికెటర్లు...

ఐపీఎల్ 2020 సీజన్ సమయంలో రోహిత్ శర్మ గాయపడ్డాడు.  పంజాబ్ కింగ్స్‌తో జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్‌లో గాయపడ్డ రోహిత్ శర్మ, ఆ తర్వాత మూడు మ్యాచుల్లో ఆడలేదు. అయితే ఏమైందో ఏమో కానీ హడావుడిగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చాడు రోహిత్ శర్మ...

రోహిత్ శర్మ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని వైద్యులు సూచించినా, గాయం మానకముందే ఆడితే తిరగబెడుతుందని హెచ్చరించినా ముంబై ఇండియన్స్ కెప్టెన్ పట్టించుకోలేదు. రోహిత్ లేని మూడు మ్యాచుల్లో కిరన్ పోలార్డ్, ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్సీ వహించి విజయాలు అందించాడు..

తాను లేకపోయినా ముంబై ఇండియన్స్ గెలుస్తుందని అభిమానులు తెలుసుకుంటారని అనుకున్నాడో లేక కెప్టెన్సీ కిరన్ పోలార్డ్‌కి వెళ్లిపోతుందని భయపడ్డాడో కానీ హడావుడిగా ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, గాయం తిరగబెట్టడంతో ఆస్ట్రేలియా టూర్‌కి దూరమయ్యాడు...

అనుకున్నట్టే ముంబై ఇండియన్స్, ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచింది. అయితే ఆస్ట్రేలియా ఫ్లైయిట్ ఎక్కాల్సిన రోహిత్ శర్మ గాయం తిరగబెట్టడంతో ఇండియాకి వచ్చి ఎన్‌సీఏలో చికిత్స తీసుకుని తిరిగి ఫిట్‌నెస్ సాధించి...  ఆఖరి రెండు టెస్టులు ఆడాడు. ప్రస్తుతం టీమిండియాకి కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ, ఐపీఎల్ ఆడడానికి ఎంత ప్రాధాన్యం ఇస్తాడో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు...

టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక సగానికి పైగా మ్యాచులకు దూరమైన రోహిత్ శర్మ, వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ పేరుతో ఐపీఎల్‌లో మ్యాచులను వదులుకోగలడా? దీనికి సమాధానం అందరికీ తెలుసు. రోహిత్ శర్మ లేకుండా ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరగాలంటే అతను తీవ్రంగా గాయపడాల్సిందే...

Jasprit Bumrah

రోహిత్ శర్మ మాత్రమే కాదు, జస్ప్రిత్ బుమ్రా కూడా ఇదే బాపతు. గాయంతో ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలకు దూరమైన జస్ప్రిత్ బుమ్రా.. శ్రీలంకతో వన్డే సిరీస్‌ ఆడతాడని ప్రకటించింది బీసీసీఐ. అయితే ముందే ఐపీఎల్ దగ్గర పడుతుండడంతో రోహిత్ శర్మ లైన్‌లోకి వచ్చి బుమ్రాని ఇప్పుడే ఆడించడం కరెక్ట్ కాదని సూచించాడట...

bumrah

దీంతో హడావుడిగా బుమ్రా వన్డే సిరీస్ ఆడతాడని ప్రకటించిన బీసీసీఐ, అతను సిరీస్ నుంచి తప్పుకున్నాడని మరోసారి ప్రకటించింది. గాయం నుంచి కోలుకోవడానికి టీమిండియా ఆడే మ్యాచులకు దూరమైన జస్ప్రిత్ బుమ్రా, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటాడా?...

ఇప్పుడు భారత క్రికెట్ ఫ్యాన్స్ వేస్తున్న ప్రశ్న ఇదే. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ పేరుతో టీమిండియా ఆడే మ్యాచులకు దూరంగా ఉంటున్న రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, విరాట్ కోహ్లీ... ఐపీఎల్ సమయానికి మాత్రం పూర్తి ఫిట్‌గా అన్ని మ్యాచులు ఆడేంత ఎనర్జీ ఎలా తెచ్చుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.. 

click me!