డబుల్ సెంచరీ బాదినా ఇషాన్ కిషన్‌ని ఆడించలేం! బాంబ్ పేల్చిన రోహిత్ శర్మ...

First Published Jan 10, 2023, 9:48 AM IST

త్రిబుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా టీమ్‌లో చోటు కోల్పోయాడు కరణ్ నాయర్. ఆరేళ్లుగా టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఇషాన్ కిషన్ పరిస్థితి కూడా అంతే అంటున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... 

బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు ఇషాన్ కిషన్. 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అతి పిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా, అత్యంత వేగంగా ద్వి శతకం నమోదు చేసిన బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు...

Image credit: PTI

అయితే డబుల్ సెంచరీ బాదిన తర్వాత కూడా ఇషాన్ కిషన్‌ని వన్డేల్లో కొనసాగించలేమని స్పష్టం చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. డబుల్ బాదిన ఇషాన్ కంటే శుబ్‌మన్ గిల్‌కి ఎక్కువ అవకాశాలని ఇవ్వాలని అనుకుంటున్నట్టు స్పష్టం చేశాడు రోహిత్ శర్మ...

Image credit: PTI

‘ఇషాన్ కిషన్ వన్డేల్లో డబుల్ సెంచరీ చేశాడు. డబుల్ సెంచరీ ఎంత ప్రత్యేకమైనదో నేను అర్థం చేసుకోగలను. అయితే అతను రిజర్వు బెంచ్‌లో కూర్చోక తప్పదు. శుబ్‌మన్ గిల్‌కి వరుసగా అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నాం...

శుబ్‌మన్ గిల్ వన్డేల్లో మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. కాబట్టి అతన్ని కొన్నాళ్లు ప్రయత్నించాలని నిర్ణయం తీసుకున్నాం. అలాగని అతన్నే కొనసాగించాలని కాదు, అందరికీ అవకాశాలు ఇస్తాం... మున్ముందు టీమిండయా చాలా మ్యాచులు ఆడబోతోంది...

Image credit: PTI

ఓపెనర్లు ఇద్దరూ బాగా ఆడుతున్నారు. అయితే ఈ ఇద్దరిలో నిలకడైన పర్ఫామెన్స్ ఇస్తూ వస్తున్న శుబ్‌మన్ గిల్‌కే అధిక ప్రాధాన్యం ఇవ్వడం సమంజసమవుతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..

శుబ్‌మన్ గిల్ గత 13 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 57+ యావరేజ్‌తో 687 పరుగులు చేశాడు. గిల్ నిలకడైన పర్ఫామెన్స్ కారణంగానే సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ని వన్డేల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

click me!