INDvsENG: మొదటి టీ20లో టీమిండియా అదే తడ‘బ్యాటు’... అయ్యర్ తప్ప అంతా...

Published : Mar 12, 2021, 08:45 PM IST

టాస్ ఓడి, మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. టాపార్డర్ ఘోరంగా ఫెయిల్ కావడంతో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా, శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్స్ కారణంగా ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది.

PREV
112
INDvsENG: మొదటి టీ20లో టీమిండియా అదే తడ‘బ్యాటు’... అయ్యర్ తప్ప అంతా...

చాలారోజుల గ్యాప్ తర్వాత బరిలో దిగిన కెఎల్ రాహుల్, నాలుగు బంతులాడి ఒక్క పరుగు మాత్రమే చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా...

212

5 బంతులాడి పరుగులేమీ చేయలేకపోయిన కెప్టెన్ విరాట్ కోహ్లీ... అదిల్ రషీద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి క్రిస్ జోర్డాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది టీమిండియా...

312

ఆ తర్వాత కొద్దిసేపటికే 12 బంతుల్లో 4 పరుగులు చేసిన శిఖర్ ధావన్, మార్క్ వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 20 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది టీమిండియా. టాప్ 3 బ్యాట్స్‌మెన్ 5 పరుగులే చేయడం టీమిండియా టీ20 చరిత్రలో ఇదే తొలిసారి...

412

23 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన రిషబ్ పంత్, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, బెయిర్ స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 48 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా...

512

10.2 ఓవర్లలో 50 పరుగుల మార్కు దాటింది టీమిండియా. టీ20 క్రికెట్ చరిత్రలో 50 మార్కు దాటడానికి 62 బంతులు ఎదుర్కోవడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి. 

612

శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లో 7 ఫోర్లతో 50 పరుగులు పూర్తి చేశాడు. అయ్యర్‌కి ఇది టీ20ల్లో మూడో హాఫ్ సెంచరీ... 

712

శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి ఐదో వికెట్‌కి 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన హార్ధిక్ పాండ్యా 21 బంతుల్లో ఒక ఫోర్, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్‌లో జోర్డాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

812

ఆ తర్వాత వచ్చిన శార్దూల్ ఠాకూర్ వస్తూనే భారీ షాట్‌కి ప్రయత్నించి, డకౌట్ అయ్యాడు. దీంతో 102 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది టీమిండియా...

912

శ్రేయాస్ అయ్యర్ 47 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 67 పరుగులు చేసిర, ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు.

1012

ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీయగా అదిల్ రషీద్, బెన్ స్టోక్స్, మార్క్ వుడ్, జోర్డాన్‌ తలా ఓ వికెట్ తీశారు. 
 
1112

స్వదేశంలో ఇంగ్లాండ్‌పై టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు శ్రేయాస్ అయ్యర్. ఇంతకుముందు కెఎల్ రాహుల్ 71 పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ 67 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచాడు. 

1212

అక్షర్ పటేల్ 7,  వాషింగ్టన్ సుందర్ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 

click me!

Recommended Stories