మొదటి రెండు మ్యాచులకు రోహిత్‌కు విశ్రాంతి... సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం దక్కేనా?

First Published Mar 12, 2021, 7:05 PM IST

మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా తీసుకున్న నిర్ణయం, భారత జట్టు అభిమానులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మకు విశ్రాంతి నిచ్చిన టీమిండియా, యంగ్ ప్లేయర్లకూ అవకాశం ఇవ్వలేదు...

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మను పక్కనబెట్టాలని నిర్ణయించుకోవడం నిజంగా చాలా సంచలన నిర్ణయమే...
undefined
అయితే టీ20 సిరీస్‌కి ఎంపిక కావడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబైన సూర్యకుమార్ యాదవ్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు. అతని కంటే నాలుగో స్థానంలో నిరూపించుకుంటున్న శ్రేయాస్ అయ్యర్‌కే తుదిజట్టులో అవకాశం దక్కింది...
undefined
ఆస్ట్రేలియా పర్యటనలో కూడా పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వని శిఖర్ ధావన్‌కి మరో అవకాశం ఇవ్వడం చూస్తుంటే, ఈ టీ20 సిరీస్‌లో భారత జట్టు ప్రయోగాలు చేయాలని ఆలోచిస్తున్నట్టు అర్థం అవుతోంది...
undefined
ఈ ఏడాది చివరన టీ20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది టీమిండియా. ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్ తర్వాత వరల్డ్‌కప్ జట్టు గురించి ఆలోచిస్తామని చెప్పారు బీసీసీఐ సెలక్టర్లు...
undefined
దీంతో వచ్చే పొట్టి ప్రపంచకప్‌ కోసం సమర్థులైన టీమ్‌ను తయారుచేసేందుకు ఈ ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను వాడుకోవాలని చూస్తోంది టీమిండియా. ఫిట్‌నెస్ టెస్టులో పాస్ అయిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో ఒకటి, రెండు అవకాశాలు దక్కొచ్చని విశ్లేషకులు అభిప్రాయం...
undefined
టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే టీమిండియాకు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్ దక్కుతుంది. అయితే టాప్ ప్లేస్ కంటే టీ20 వరల్డ్‌కప్ కోసం సన్నద్ధమవ్వడంపైనే టీమిండియా పూర్తిగా ఫోకస్ పెట్టింది. అందుకే ప్రయోగాలు చేసైనా సరే, క్లిష్ట పరిస్థితుల్లో రాణించగల సత్తా ఉన్న ఆటగాళ్లను పరీక్షించాలని చూస్తోంది...
undefined
ఎప్పుడూ లేనట్టుగా పటిష్టమైన రిజర్వు బెంచ్‌తో కళకళలాడుతున్న టీమిండియా, మొదటి టీ20 మ్యాచ్‌లో విజయం సాధిస్తే మాత్రం... మరింత జోష్‌తో ముందుకెళ్లడం ఖాయం...
undefined
ఒకవేళ రోహిత్ శర్మ ఆడని రెండు మ్యాచుల్లో ఓడితే మాత్రం.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై, సెలక్టర్లపై విపరీతమైన ట్రోలింగ్ రావడం ఖాయం...
undefined
టెస్టు సిరీస్‌లో రాణించడంతో రోహిత్ శర్మకు క్రెడిట్ వెళ్లడాన్ని తట్టుకోలేక, అతన్ని కావాలని మొదటి రెండు మ్యాచులకు దూరంగా ఉంచారని ఇప్పటికే హిట్ మ్యాన్ అభిమానులు, సోషల్ మీడియాలో రచ్చ ప్రారంభించారు...
undefined
click me!