ఇదేం బ్యాటింగ్ స్వామీ... ‘కింగ్’ విరాట్ కోహ్లీ శకం ముగిసినట్టేనా...

Published : Mar 12, 2021, 07:47 PM ISTUpdated : Mar 12, 2021, 07:49 PM IST

విరాట్ కోహ్లీ... క్రికెట్ ప్రపంచంలోనే ఈ పేరు ఓ సంచలనం. క్రికెట్ వరల్డ్ నివ్వెరపోయేలా పరుగుల వరద పారించిన రన్ మెషిన్, ఇప్పుడు గాడి తప్పింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో డకౌట్ అయిన విధానం, క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది.

PREV
112
ఇదేం బ్యాటింగ్ స్వామీ... ‘కింగ్’ విరాట్ కోహ్లీ శకం ముగిసినట్టేనా...

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రెండు సార్లు డకౌట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. రెండో టెస్టులో మొయిన్ ఆలీ బౌలింగ్‌లో, నాలుగో టెస్టులో బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అయిన విధానం ఎవ్వరినీ ఆశ్చర్యానికి గురి చేయలేదు.

212

కారణం మొయిన్ ఆలీ, బెన్ స్టోక్స్ అద్భుతమైన బంతులతో విరాట్ కోహ్లీ పక్కా ప్లానింగ్‌తో పెవిలియన్ చేర్చారు. కానీ తొలి టీ20 మ్యాచ్‌లో మాత్రం విరాట్ కోహ్లీ చెత్త షాట్‌తో పెవిలియన్ చేరాడు. 

312

5 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ, అదిల్ రషీద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, క్రిస్ జోర్డాన్ చేతుల్లోకి క్యాచ్ ఇచ్చాడు. నిలకడకు మారుపేరైన విరాట్ కోహ్లీ, ఇలాంటి షాట్ ఆడడమే, ఆయన ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేసింది...

412

2021లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్‌గా చెత్త రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. టెస్టుల్లో రెండుసార్లు, మొదటి టీ20లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ... ఇప్పటికే మూడు సార్లు డకౌట్ అయ్యాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్ స్టో, కుషల్ మెండీస్, నోకియా కూడా మూడేసి సార్లు డకౌట్ అయ్యారు.

512

విరాట్ కోహ్లీ 71వ సెంచరీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న అతని అభిమానులకు రెండేళ్లుగా నిరాశ తప్పడం లేదు. విరాట్ సెంచరీ చేయకపోయినా పర్లేదు కానీ, అతను ఇలా డకౌట్ కావడం మాత్రం కోహ్లీ అభిమానులకు తీవ్రంగా నిరుత్సాహపరుస్తోంది..

612

అద్భుతంగా రాణిస్తున్న రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చే బదులు, ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ కొన్ని మ్యాచులకు రెస్టు తీసుకుని, మంచి కమ్ బ్యాక్ ఇచ్చిఉంటే బాగుండేదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. 

712

తొలి 80 టీ20 మ్యాచుల్లో అత్యల్ప సార్లు డకౌట్ అయిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. ధోనీ, షోయబ్ మాలిక్ ఓ సారి, మార్టిన్ గుప్టిల్ రెండుసార్లు... విరాట్ కోహ్లీ, ఇయాన్ మోర్గాన్ మూడేసి సార్లు డకౌట్ అయ్యారు. 

812

విరాట్ కోహ్లీని టీ20ల్లో డకౌట్ చేసిన మూడో బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు అదిల్ రషీద్ ఇంతకుముందు ఆసీస్ బౌలర్ జాసన్ బెరెడ్రాఫ్, ఐర్లాండ్ బౌలర్ పీటర్ ఛేజ్... విరాట్‌ను డకౌట్ చేశారు. 

912

ధావన్ 4, కెఎల్ రాహుల్ 1 పరుగుకి అవుట్ కాగా కోహ్లీ డకౌట్ అయ్యాడు. టీ20 చరిత్రలోనే టీమిండియా టాప్ 3 బ్యాట్స్‌మెన్ 5 పరుగులలోపే చేయడం ఇదే తొలిసారి... 

1012

1 పరుగుకే అవుటైన కెఎల్ రాహుల్, స్వదేశంలో నాలుగేళ్ల తర్వాత సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అయ్యాడు. 2017లో శ్రీలంకపై 4 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మళ్లీ నాలుగేళ్ల తర్వాత డబుల్ డిజిట్ చేరకుండానే అవుట్ అయ్యాడు...

1112

రెండో ఓవర్‌లో కెఎల్ రాహుల్ వికెట్ తీయడమే కాకుండా మెయిడిన్ ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్, టీమిండియాపై టీ20ల్లో మెయిడిన్ వేసిన మూడో ఇంగ్లాండ్ బౌలర్‌గా నిలిచాడు. ఇంతకుముందు 2011లో టిమ్ బ్రెస్‌నన్, రవిబొపారా మాత్రమే ఈ ఫీట్ సాధించారు.
 
1212

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత సారథిగా చెత్త రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. సౌరవ్ గంగూలీ 13 సార్లు డకౌట్ కాగా, విరాట్ కోహ్లీ డకౌట్ కావడం ఇది 14వ సారి.

click me!

Recommended Stories