సంజూ శాంసన్, ఐపీఎల్‌లో ఆరో స్థానంలో ఆడతాడా? నిజంగా మీకో ప్లానింగ్ ఉందా... కమ్రాన్ అక్మల్ కామెంట్స్...

Published : Aug 06, 2023, 05:43 PM IST

ఏ ప్లేయర్ అయినా బాగా ఆడుతుంటే, అతన్ని మరింత ఎక్కువగా ఉపయోగించుకోవాలని ఏ టీమ్ అయినా చూస్తుంది. అయితే టీమిండియా మాత్రం సంజూ శాంసన్‌ని టీమ్ నుంచి తప్పించాలని ఎలా తప్పించాలని రకరకాలుగా ప్రయత్నిస్తోంది...  

PREV
18
సంజూ శాంసన్, ఐపీఎల్‌లో ఆరో స్థానంలో ఆడతాడా? నిజంగా మీకో ప్లానింగ్ ఉందా... కమ్రాన్ అక్మల్ కామెంట్స్...
sanju samson

వన్డే ఫార్మాట్‌లో 60కి పైగా సగటు ఉన్న సంజూ శాంసన్‌ కంటే వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్ ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో సంజూ శాంసన్ కంటే సూర్యకి చోటు దక్కేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి..

28
Sanju Samson Fans

తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో స్పిన్ బౌలింగ్‌ని చక్కగా ఆడే సంజూ శాంసన్, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. హార్ధిక్ పాండ్యా కూడా సంజూ శాంసన్ కంటే ముందు బ్యాటింగ్‌కి వచ్చాడు..

38
Sanju Samson Wicket

ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సంజూ శాంసన్, 12 బంతుల్లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఇదే మ్యాచ్‌కి టర్నింగ్ పాయింట్ అయ్యింది. సంజూ మరో రెండు ఓవర్లు బ్యాటింగ్ చేసి ఉంటే మ్యాచ్ రిజల్ట్ మారిపోయి ఉండేది. 

48

‘టీమిండియా కెప్టెన్, కోచ్, మేనేజ్‌మెంట్‌ చాలా ఓవర్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. వెస్టిండీస్‌పై ఎలాగోలా గెలిచేస్తామనే ధీమాతోనే రకరకాల ప్రయోగాలు చేస్తున్నట్టు ఉంది. నాకు తెలిసి టీమిండియా ఓ ప్లానింగ్‌తో అస్సలు ఆడడం లేదు..

58
Sanju Samson

ప్రయోగాలు చేయడం మంచిదే! అయితే ప్రతీ ప్రయోగం వెనకా ఓ పద్ధతీ, ప్లానింగ్ ఉండాలి. ప్లేయర్ల రోల్‌పై క్లారిటీ ఉండాలి. టీమిండియాని చూస్తుంటే ప్లేయర్లకే కాదు, ఎవరిని ఏ ప్లేస్‌లో ఆడించాలని కెప్టెన్‌కి, కోచ్‌కి కూడా క్లారిటీ లేనట్టు ఉంది..

68

సంజూ శాంసన్ ఎప్పుడైనా ఐపీఎల్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేశాడా? అతను టాపార్డర్ ప్లేయర్. టాప్ 4లో అవకాశం ఇస్తే బాగా పరుగులు చేయగలడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేనప్పుడు సంజూ  శాంసన్ లాంటి ప్లేయర్‌ని టాపార్డర్‌లో ఆడిస్తే మంచి రిజల్ట్ వస్తుంది..

78

ఆఖరి వన్డేలో సంజూ శాంసన్ ఎలా ఆడాడో అందరూ చూశారు. అలాంటి అగ్రెసివ్ బ్యాటర్‌ని టాపార్డర్‌లో పంపాలి. తిలక్ వర్మ ఆరంగ్రేటం చేశాడు. అల్జెరీ జోషఫ్ బౌలింగ్‌ని చక్కగా ఎదుర్కొన్నాడు. అయితే సంజూ శాంసన్ లాంటి ప్లేయర్‌, మూడో స్థానంలో ఉండాలి..

88

ఓ ఆరంగ్రేటం ప్లేయర్ కోసం దేశవాళీ టోర్నీల్లో, ఐపీఎల్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న ప్లేయర్‌ని బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి దించడం కరెక్ట్ కాదు. చూస్తుంటే నెంబర్లు వేసుకుని ప్లేయర్లను బ్యాటింగ్‌కి పంపుతున్నట్టుగా కనిపిస్తోంది..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్..

click me!

Recommended Stories