టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో ఆడతా! రిటైర్మెంట్‌ వార్తలపై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ...

First Published | Aug 6, 2023, 4:39 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ ఇప్పటిదాకా ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. రాహుల్, టీ20లకు పనికి రాడని తేలిపోవడంతో పక్కనబెట్టేసిన సెలక్టర్లు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లను వన్డే, టెస్టులకే పరిమితం చేశారు...
 

Virat Kohli and Rohit Sharma

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ తర్వాత 36 ఏళ్ల రోహిత్ శర్మ రిటైర్ అవుతాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే 36 ఏళ్ల రోహిత్ శర్మ మాత్రం టీ20ల నుంచి తప్పుకోలేదని, వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో కూడా ఆడబోతున్నట్టు ప్రకటించాడు..


వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి రాగా రోహిత్ శర్మ మాత్రం యూఎస్‌ఏకి వెళ్లాడు. అక్కడ రోహిత్ శర్మ క్రికెట్ అకాడమీని ప్రారంభించిన హిట్ మ్యాన్, ఈ ప్రారంభ వేడుకలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.. 
 

Latest Videos



‘నేను కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇక్కడికి రాలేదు. యూఎస్‌ఏ రావడానికి మరో కారణం కూడా ఉంది.  వరల్డ్ కప్ వస్తోంది. వచ్చే ఏడాది జూన్‌లో ఇక్కడే టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. అందరూ ఆ టోర్నీ గురించి ఆసక్తిగా ఎదురూచూస్తున్నారని తెలుసుకున్నా. నేను కూడా ఆ టోర్నీలో ఆడాలనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ..

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ, బ్యాటర్‌గా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం అందుకుంది భారత జట్టు...

ఈ పరాజయం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గానే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ కోసం జట్టును తయారుచేస్తోంది టీమిండియా.. 

టీమిండియా తరుపున 148 టీ20 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, అత్యధిక టీ20 మ్యాచులు ఆడిన క్రికెటర్‌గా టాప్‌లో ఉన్నాడు. అంతేకాకుండా టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు, అత్యధిక సిక్సర్లు సాధించిన రికార్డు కూడా రోహిత్ పేరిటే ఉంది..
 

ఐపీఎల్ 2023 సీజన్‌లో కూడా బ్యాటర్‌గా ఫెయిల్ అయిన రోహిత్ శర్మ, ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో చోటు దక్కించుకోవడం కష్టమే. అయితే కెప్టెన్‌ రోహిత్ శర్మను తిరిగి టీ20ల్లో ఆడించాలని బీసీసీఐ భావిస్తే మాత్రం అతని ఫామ్‌తో సంబంధం లేకుండా పొట్టి ఫార్మాట్‌లో రీఎంట్రీ ఇవ్వడం ఖాయం.. 

click me!