పీసీబీ చీఫ్ సెలక్టర్‌గా ఇంజమామ్ వుల్ హక్... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు అస్త్రాలు సిద్ధం...

Published : Aug 06, 2023, 05:17 PM IST

గడిచిన ఏడాది కాలంలో ముగ్గురు ప్రెసిడెంట్లను మార్చింది పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు. రమీజ్ రాజా ప్లేస్‌లో నజం సేథీ రాగా ఇప్పుడు అతని ప్లేస్‌లో జకా ఆష్రఫ్... పీసీబీ ఛైర్మెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. 

PREV
17
పీసీబీ చీఫ్ సెలక్టర్‌గా ఇంజమామ్ వుల్ హక్... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు అస్త్రాలు సిద్ధం...

త్వరలో పాక్ మాజీ బ్యాటింగ్ లెజెండ్, మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్‌ని చీఫ్ సెలక్టర్‌గా నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందట పీసీబీ. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ధారించింది..

27

‘క్రికెట్ టెక్నికల్ కమిటీ సభ్యులు మిస్బా వుల్ హక్, ఇంజమామ్ వుల్ హక్, మహ్మద్ హఫీజ్ కలిసి కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నారు. పాక్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ మిక్కీ ఆథర్, హెడ్ కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్ కూడా ఈ కమిటిలో సభ్యులుగా ఉంటారు...

37

సెలక్షన్ కమిటీ ఏర్పాటు విషయంలో బాబర్ ఆజమ్ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం. ఇంజమామ్ వుల్ హక్‌, చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది..’ అంటూ పీసీబీ అధికారులు తెలిపినట్టు పీటీఐ రాసుకొచ్చింది.. 

47

అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత 2016 నుంచి 2019 మధ్య కాలంలో పీసీబీ చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరించాడు ఇంజమామ్ వుల్ హక్. ఈ సమయంలోనే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఇండియాని ఓడించి, ఛాంపియన్‌గా నిలిచింది పాక్ టీమ్. 

57

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు, 2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీకి  ముందు కూడా ఇదే విధంగా పాక్ క్రికెట్ బోర్డులో మార్పులు జరిగాయి. ఈ ఎఫెక్ట్ పాక్ టీమ్‌పై నెగిటివ్‌గా పడుతుందని అనుకున్నారు అభిమానులు.. 

67

2021లో టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మొదటిసారి ఇండియాని ఓడించిన పాకిస్తాన్, సెమీ ఫైనల్‌కి చేరింది. 2022 టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, జింబాబ్వే చేతుల్లో ఓడిన పాకిస్తాన్, అన్యూహ్యంగా లక్ కలిసి రావడంతో ఫైనల్‌కి దూసుకెళ్లింది..

77

గత రెండు వరల్డ్ కప్ టోర్నీల్లోనూ పాకిస్తాన్, టీమిండియా కంటే బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చింది. ఈసారి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు పీసీబీ జరుగుతున్న మార్పులు,  పాక్ జట్టుకి కలిసి వస్తాయని అంటున్నారు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్.. 

click me!

Recommended Stories