పూజారాని పక్కనబెట్టేసినట్టేనా... పృథ్వీషాతో పాటు మరో బ్యాట్స్‌మెన్ కావాలంటూ...

Published : Jul 06, 2021, 09:17 AM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ పర్ఫామెన్స్‌ ఎఫెక్ట్, పూజారాపై భారీగానే పడినట్టు కనిపిస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో పూజారాని పక్కనబెట్టేందుకే విరాట్ కోహ్లీ అండ్ కో భావిస్తున్నట్టు సమాచారం...

PREV
111
పూజారాని పక్కనబెట్టేసినట్టేనా... పృథ్వీషాతో పాటు మరో బ్యాట్స్‌మెన్ కావాలంటూ...

గాయం కారణంగా శుబ్‌మన్ గిల్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందే స్వదేశానికి తిరిగి రానున్నాడు. అతనికి శస్త్రచికిత్స అవసరం లేదని తేల్చినా, కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని తేలడంతో స్వదేశానికి పంపనున్నారు...

211

శుబ్‌మన్ గిల్ స్థానంలో ఓపెనర్‌గా పృథ్వీషాను పంపాలని సెలక్టర్లను కోరింది టీమ్‌ మేనేజ్‌మెంట్. ప్రస్తుతం శ్రీలంక టూర్‌లో ఉన్న పృథ్వీషా, ఆ సిరీస్ ముగించుకున్న తర్వాత ఇంగ్లాండ్ చేరుకోబోతున్నాడు...

311

అతనితో పాటు మరో బ్యాట్స్‌మెన్ కూడా కావాలని సెలక్టర్లను కోరిందట టీమ్ మేనేజ్‌మెంట్‌. ఇప్పటికే భారత జట్టులో బ్యాట్స్‌మెన్లకు కొదువ లేదు. మరి ఎవరి స్థానంలో ఆడించేందుకు బ్యాట్స్‌మెన్‌ను కోరారనేది తేలాల్సి ఉంది...

411

విజయ్ హజారే ట్రోఫీ, ఐపీఎల్ 2021 సీజన్‌లో అదరగొట్టిన యంగ్ బ్యాట్స్‌మెన్ దేవ్‌దత్ పడిక్కల్‌ను టెస్టుల్లో ఆడించాలని విరాట్ కోహ్లీ భావిస్తున్నట్టు సమాచారం...

511

అయితే ఇప్పటికే కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, అభిమన్యు ఈశ్వరన్ రూపంలో భారత జట్టులో నలుగురు బ్యాట్స్‌మెన్లు... భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు...

611

నలుగురు ప్లేయర్లు ఉన్నా, ఇంకా ప్లేయర్లను కోరుకోవడంపై సెలక్టర్లు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికైతే సరైన కారణం చూపించకుండా ప్లేయర్లు కావాలని కోరడాన్ని సెలక్టర్లు తప్పుబట్టినట్టు సమాచారం...

711

అయితే టెస్టు సిరీస్ ఆరంభానికి ఇంకా నెల రోజుల సమయం ఉండడంతో ఆ లోపు ప్లేయర్ల గురించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది...

811

జనవరిలో ఆస్ట్రేలియా టూర్‌లో బౌన్సర్లకు అడ్డుగా తన శరీరాన్ని పెట్టి నిలబెట్టి, మోస్ట్ డేరింగ్ ఇన్నింగ్స్ ఆడిన ఛతేశ్వర్ పూజారా... ఆరు నెలలు తిరిగే సరికి తుదిజట్టులో చోటు కోసం పోటీపడాల్సిన పరిస్థితిలో పడడం విశేషం...

911

హనుమ విహారి కూడా సిడ్నీ టెస్టులో అద్వితీయమైన ఇన్నింగ్స్ ఆడి చారిత్రక డ్రాలో కీలక పాత్ర పోషించాడు. గాయంతోనే క్రీజులోనే పాతుకుపోయి 55 ఓవర్లు పాటు బ్యాటింగ్ చేశాడు...

1011

మయాంక్ అగర్వాల్‌కి గత రెండేళ్లలో రెండు డబుల్ సెంచరీలు, మూడు సెంచరీలు ఉన్నాయి. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 800+ పరుగులు చేసిన నలుగురు ప్లేయర్లలో మయాంక్ అగర్వాల్ ఒకడు...

1111

కెఎల్ రాహుల్‌కి టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. దాదాపు 3 వేల టెస్టు పరుగులు సాధించాడు కెఎల్ రాహుల్. అలాంటి నలుగురు ప్లేయర్లను పక్కనబెట్టి, మరో బ్యాట్స్‌మెన్ కావాలని కోరడంపై క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు...

click me!

Recommended Stories