ఐపీఎల్ 2021 సీజన్ ఆడతానంటున్న శ్రేయాస్ అయ్యర్... రిషబ్ పంత్ కెప్టెన్సీకి...

First Published Jul 5, 2021, 4:01 PM IST

మొట్టమొదటిసారి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుని ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును అద్భుతంగా నడిపించాడు రిషబ్ పంత్. అయితే శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీతో రిషబ్ పంత్‌కి చెక్ పడనుంది...

ఐపీఎల్ 2021 అర్ధాంతరంగా నిలిచే సమయానికి సీజన్‌లో 8 మ్యాచులు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్, ఆరు మ్యాచుల్లో విజయాలు సాధించి, టేబుల్ టాపర్‌గా నిలిచింది...
undefined
రెగ్యూలర్ కెప్టెన్ శ్రేయార్ అయ్యర్ గైర్హజరీతో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, జట్టును అద్భుతంగా నడిపించి ఫ్యూచర్ కెప్టెన్‌గా ఫీడ్‌బ్యాక్ కూడా అందుకున్నాడు...
undefined
ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడిన శ్రేయాస్ అయ్యర్, పూర్తిగా కోలుకుని ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచుల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించాడు..
undefined
అన్నీ సజావుగా జరిగి ఉంటే, జూన్‌లో ఇంగ్లాండ్‌లో కౌంటీల్లో పాల్గొనాల్సింది శ్రేయాస్ అయ్యర్. అయితే ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అయ్యర్‌కి శస్త్రచికిత్స జరగడంతో కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు...
undefined
గాయం కారణంగానే ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌లో పాల్గొనలేకపోయిన శ్రేయాస్ అయ్యర్, శ్రీలంక టూర్‌ను కూడా మిస్ చేసుకున్నాడు...
undefined
శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్ సాధించి ఉంటే, శ్రీలంకలో పర్యటించే జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించి ఉండేవాడు. అయ్యర్ గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స్థానంలో శిఖర్ ధావన్‌కి కెప్టెన్సీ దక్కింది...
undefined
‘నేను ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడబోతున్నా. అయితే ఇప్పటికైతే కెప్టెన్సీ గురించి తెలీదు. ఎందుకంటే కెప్టెన్‌గా ఎవరు ఉండాలనేది ఐపీఎల్ ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్ చేతుల్లో ఉంటుంది...
undefined
రిషబ్ పంత్ కెప్టెన్సీలో కూడా జట్టు బాగా ఆడింది. ఇప్పటికే మేం టాప్‌లో ఉన్నాం. నా లక్ష్యం ఇప్పటిదాకా ట్రోఫీ గెలవని ఢిల్లీ, టైటిల్ గెలవడమే... ’ అంటూ కామెంట్ చేశాడు శ్రేయాస్ అయ్యర్...
undefined
శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకుని, రీఎంట్రీ ఇస్తే అతనికే కెప్టెన్సీ దక్కే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారి అయ్యర్ కెప్టెన్సీలోనే ఫైనల్‌కి అర్హత సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు...
undefined
ఎందరో కెప్టెన్లు చేయలేకపోయిన పనిని చేసి చూపెట్టిన శ్రేయాస్ అయ్యర్, అద్భుతంగా జట్టును నడిపించగలనని నిరూపించుకున్నాడు కూడా... పంత్ ఆకట్టుకున్నా, అయ్యర్‌కి ఉన్న అనుభవం, గత పర్ఫామెన్స్‌ల దృష్ట్యా అతనికే సారథ్య బాధ్యతలు దక్కొచ్చు.
undefined
click me!