మేం పెడతాం, మా దగ్గర నిర్వహించండి... ఐసీసీ ఈవెంట్ల నిర్వహణకు 17 దేశాల ఆసక్తి...

Published : Jul 05, 2021, 04:19 PM IST

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్, షెడ్యూల్ ప్రకారం భారత్‌లో జరగాల్సింది. అయితే కరోనా కేసుల కారణంగా యూఏఈ వేదికగా జరగనుంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనుంది..

PREV
18
మేం పెడతాం, మా దగ్గర నిర్వహించండి... ఐసీసీ ఈవెంట్ల నిర్వహణకు 17 దేశాల ఆసక్తి...

2024 నుంచి 31 వరకూ జరిగే ఐసీసీ ఈవెంట్ల కోసం క్రికెట్ దేశాల నుంచి నామినేషన్లను ఆహ్వానించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. అయితే అన్యూహ్యంగా ఏకంగా 17 దేశాలు, ఐసీసీ ఈవెంట్ల నిర్వహణకు ఆసక్తిగా ఉన్నట్టు తెలపడం విశేషం.

28

2023 తర్వాత జరిగే రెండు మెన్స్ వరల్డ్‌కప్స్, నాలుగు టీ20 వరల్డ్‌కప్స్‌తో పాటు రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు నిర్వహించేందుకు 2024-31 షెడ్యూల్ రూపొందించింది ఐసీసీ... 

38

ఈ ఈవెంట్ల నిర్వహణకు భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, మలేషియా, నమీబియా, న్యూజిలాండ్, ఓమన్, పాకిస్తాన్, స్కాట్లాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, యూఏఈ, యూఎస్‌ఏ, జింబాబ్వే దేశాలు ఆసక్తి చూపించాయి.

48

‘ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని మేం ఊహించనే లేదు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను విస్తరింపచేసేందుకు ఈ ఈవెంట్స్ తోడ్పడుతాయని అంచనా వేస్తున్నాం... 

58

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ చూసేవారి సంఖ్య వందకోట్లకు పైగానే ఉంది. ఐసీసీ ఈవెంట్ల నిర్వహణ ద్వారా ఆతిథ్య దేశాలకు ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు కూడా అందుతాయి... 

68

త్వరలోనే నామినేషన్లను పరిశీలించి, సెకండ్ ఫేజ్ ప్రాసెస్‌ను తెలియచేస్తాం...’ అంటూ తెలిపాడు ఐసీసీ తాత్కాలిక సీఈవో జియోఫ్ అల్రాడిస్...

78

2021 టీ20 వరల్డ్‌కప్ టోర్నీ యూఏఈ, ఓమన్ వేదికగా జరగబోతున్నప్పటికీ, వాటి నిర్వహణ బాధ్యతలను బీసీసీఐ పర్యవేక్షించనుంది. అలాగే 2023 వన్డే వరల్డ్‌కప్ టోర్నీ కూడా భారత్‌లోనే జరగనుంది.

88

2023 వన్డే వరల్డ్‌కప్ తర్వాత జరిగే 2027, 2031 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలతో పాటు టీ20 వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీల నిర్వహణకు కూడా బీసీసీఐ ఆసక్తి చూపించడం విశేషం.

click me!

Recommended Stories