ముగ్గురు కెప్టెన్లు అవసరం లేదు... విరాట్ కోహ్లీ లేకుండా రోహిత్ శర్మ, రహానే రాణించగలరా...

First Published Jan 29, 2021, 1:49 PM IST

భారత జట్టుకి మొట్టమొదటి వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్. ప్రస్తుతం ప్రొఫెషనల్ గోల్ఫ్ ప్లేయర్‌గా రాణిస్తున్న కపిల్ దేవ్... ఆస్ట్రేలియాలో భారత జట్టు సాధించిన విజయం తన కెరీర్‌లో చూసిన అతిగొప్ప విజయమని కొనియాడారు. వరల్డ్‌కప్ కంటే ఇదే పెద్ద విజయంతో సమానమని కామెంట్ చేశారు.

‘ఆస్ట్రేలియా టూర్‌లో సీనియర్లు లేకుండా భారత జట్టు అద్భుతమై చేసింది. భారత కెప్టెన్, వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ లేకుండా దక్కిన ఈ విజయం నిజంగా ది బెస్ట్...
undefined
రోహిత్ శర్మ కూడా పూర్తి సిరీస్ ఆడలేదు. ఆడిన దాంట్లో అతను పెద్దగా పర్ఫామెన్స్ ఇచ్చింది కూడా లేదు... సగం మంది ఆటగాళ్లు గాయపడినా... పట్టు వదలకుండా సిరీస్ గెలిచారు...
undefined
గబ్బా టెస్టులో భారత జట్టు యువకులతో సాధించిన విజయం నా కెరీర్‌లోనే నేను చూసిన బెస్ట్ పర్ఫామెన్స్...
undefined
ఎన్నో సమస్యలను అధిగమించి, భారత జట్టు సాధించిన విజయానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే... ’ అంటూ చెప్పుకొచ్చాడు కపిల్ దేవ్.
undefined
ఐపీఎల్ 2020 తర్వాత టీ20 కెప్టెన్సీ రోహిత్ శర్మకు అప్పగించాలని, ఆస్ట్రేలియా టూర్ ఫలితం తర్వాత టెస్టు కెప్టెన్సీ అజింకా రహానేకి ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే...
undefined
అయితే భారత జట్టుకి ఈ సంస్కృతి సెట్ అవ్వదంటున్నారు కపిల్ దేవ్... ‘మిగిలిన దేశాలతో పోలిస్తే మన క్రికెట్ కల్చర్ వేరు. వేర్వేరు ఫార్మట్లకి వేర్వేరు కెప్టెన్ల ఫార్ములా మన దగ్గర వర్కవుట్ కాదు...
undefined
విరాట్ కోహ్లీ ఆడనప్పుడు రోహిత్ శర్మ, అజింకా రహానే బాగానే రాణిస్తున్నారు. అయితే విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్‌మెన్, కమ్ కెప్టెన్ పూర్తిగా లేకపోతే వీరి నుంచి ఇదే రేంజ్ పర్ఫామెన్స్ వస్తుందా అంటే చెప్పలేం... ’ అంటూ వ్యాఖ్యానించాడు కపిల్ దేవ్...
undefined
ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతంగా రాణించిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ప్రశంసించిన కపిల్ దేవ్, అతను మరో ఐదేళ్లు ఇలాంటి ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
undefined
శుబ్‌మన్ గిల్, పృథ్వీషా ఆటతీరు తనకెంతో నచ్చిందని చెప్పిన కపిల్... వాషింగ్టన్ సుందర్ పర్ఫామెన్స్ చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు.
undefined
ఆస్ట్రేలియాటూర్‌లో ఫెయిల్ అయినప్పటికీ పృథ్వీషాకి మంచి భవిష్యత్తు ఉందని, రెండేళ్లుగా అతని బ్యాటింగ్ చూస్తే ఈ విషయం అర్థమవుతుందని చెప్పారు కపిల్ దేవ్.
undefined
click me!