ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ వింత ప్రవర్తన... కోహ్లీ ఆ సమస్యతో బాధపడుతున్నాడా...

First Published Jun 21, 2021, 3:24 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌‌కి వరుణుడు, వాతావరణం అంతరాయం కలిగిస్తూనే ఉన్నాయి. అయితే నిన్న జరిగిన ఆటలో భారత సారథి విరాట్ కోహ్లీ ప్రవర్తన చాలామంది క్రికెట్ ఫ్యాన్స్‌కి వింతగా అనిపించింది...

తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 217 పరుగులకి ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ తొలి వికెట్‌కి 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది... అంటే ఆధిక్యం న్యూజిలాండ్‌దే... అయితే క్రీజులో విరాట్ ప్రవర్తన మాత్రమే వేరేగా ఉండింది...
undefined
ఓ వైపు వికెట్లు రాక బౌలర్లు అసహనానికి గురి అవుతుంటే, ఫ్యాన్స్ వికెట్లు కోసం స్టేడియంలో గోల చేస్తూ ఉంటే... విరాట్ కోహ్లీ మాత్రం స్టేడియంలో నవ్వుతూ స్టెప్పులు వేసి కనిపించాడు...
undefined
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నామనే ప్రెషర్ కనిపించకుండా, మిగిలిన ప్లేయర్లలో జోష్ నింపించేందుకు కోహ్లీ అలా చేసి ఉండవచ్చని భావించారు....
undefined
అయితే న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్‌తో వ్యవహరించిన విధానం కూడా క్రికెట్ ఫ్యాన్స్‌కి ఆశ్చర్యాన్ని కలిగించింది...
undefined
భారత యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు టామ్ లాథమ్‌ను సెడ్జింగ్ చేస్తూ కవ్వించాడు కోహ్లీ... ఎంతో జాగ్రత్తగా ఆడుతూ వికెట్ పడకుండా ఇన్నింగ్స్ నిర్మిస్తున్న లాథమ్‌ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు కోహ్లీ వేసిన ఎత్తుగడ ఇది...
undefined
అయితే టామ్ లాథమ్ అవుటైన వెళ్తున్న సమయంలో విరాట్ కోహ్లీ... జెర్సీకి ముద్దుపెడుతూ, వెళ్లు, వెళ్లు అంటూ సైగ చేశాడు... ఇది ఎందుకు చేశాడు? న్యూజిలాండ్ ప్రేక్షకులు ఏమైనా కామెంట్ చేశారా? అంటే అదీ లేదు...
undefined
ఆస్ట్రేలియా క్రికెటర్లలా న్యూజిలాండ్ ప్లేయర్, సెడ్జింగ్ చేయలేదు. టామ్ లాథమ్, విరాట్ కోహ్లీ మధ్య ఎలాంటి మాటల యుద్ధమూ జరగలేదు. మరి కోహ్లీ ఎందుకిలా చేశాడని ఫ్యాన్స్‌కి అర్థం కావడం లేదు...
undefined
ఇది మాత్రమే కాకుండా, ఫైనల్ మ్యాచ్‌ని కూడా సాధారణ టెస్టులాగే చూస్తామని చెప్పిన విరాట్ కోహ్లీ... ఫైనల్ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే మైండ్‌సెట్‌తో బరిలో దిగినట్టు తెలుస్తోంది...
undefined
అయితే న్యూజిలాండ్ ఆధిక్యం చెలాయిస్తుండడంతో తన పాజిటివ్ యాటిట్యూడ్‌తో వారిపై పైచేయి సాధించాలనే తాపత్రయం విరాట్ కోహ్లీలో కనిపించింది...
undefined
నిన్న జరిగిన ఆటలో విరాట్ కోహ్లీ ప్రవర్తనను చూసిన చాలామంది, అతను ఓవర్ యాక్సైటీకి గురయ్యారని, ఫైనల్ ఆడుతున్నామనే ఒత్తిడి వల్లే ఇలా జరిగిందని పోస్టులు చేస్తున్నారు...
undefined
తన బ్యాటింగ్‌లో 132 బంతులాడితే ఒకే ఒక్క ఫోర్ బాదాడు విరాట్ కోహ్లీ... వికెట్ కోల్పోకూడదని భారత సారథి చూపించిన అతిజాగ్రత్తే దీనికి కారణమంటున్నారు విశ్లేషకులు...
undefined
విరాట్ కోహ్లీతో పోలిస్తే, రోహిత్ శర్మ, అజింకా రహానేతో పాటు మిగిలిన ప్లేయర్లు మొత్తం చాలా కూల్ అండ్ కామ్‌గా ప్రవర్తించారు...
undefined
తన కెరీర్‌లో ఒక్క ఐసీసీ టోర్నీ గెలవలేదనే లోటు తీర్చుకోవాలనే ఆలోచన విరాట్ కోహ్లీది. దాదాపు రెండేళ్లుగా దీని గురించి ప్రణాళికలు రచిస్తున్నాడు కోహ్లీ...
undefined
గెలిచినా, ఓడినా మళ్లీ క్రికెట్ ఆడతామని మీడియా సమావేశంలో చెప్పినా... విరాట్ కోహ్లీ యాటిట్యూట్‌లో మాత్రం ఫైనల్ ఆడుతున్నామనే ప్రెషర్ స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు సైకాలజిస్టులు.
undefined
click me!