వాళ్లు అలా, మనోళ్లు ఇలా... స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేయకపోవడం...

First Published Jun 20, 2021, 10:43 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, క్రికెట్ విశ్లేషకులు అంచనా వేసినట్టే సాగేలా కనిపిస్తోంది. న్యూజిలాండ్ పిచ్, వాతావరణ పరిస్థితులకు దగ్గర ఉండే ఇంగ్లాండ్‌లో కివీస్ పేసర్లు అదరగొట్టగా, భారత బౌలర్లు వికెట్లు పడగొట్టడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు...

సౌంతిప్టన్ పిచ్ కండీషన్స్ స్వింగ్‌కి అద్భుతంగా అనుకూలిస్తుంది. పిచ్‌ను సరిగ్గా ఉపయోగించుకున్న న్యూజిలాండ్ యంగ్ బౌలర్ కేల్ జెమ్మీసన్, తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి అదరగొట్టాడు...
undefined
పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తున్న తీరు చూసి, భారత బౌలర్లు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను స్వల్ప స్కోరుకే చుట్టేయడం ఖాయమనుకున్నారంతా...
undefined
అయితే సీన్ రివర్స్ అయింది. 100 టెస్టులకు పైగా ఆడిన అనుభవం ఉన్న ఇషాంత్ శర్మతో పాటు ఇంగ్లాండ్‌లో అద్భుతంగా రాణించే మహ్మద్ షమీ, స్టార్ పేసర్ బుమ్రా తొలి 44 ఓవర్లలో ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.
undefined
న్యూజిలాండ్ బౌలర్లు బంతిని 2 డిగ్రీలకు పైగా స్వింగ్ చేస్తే, భారత బౌలర్ల బౌలింగ్‌లో బంతి కేవలం 0.9 డిగ్రీలు మాత్రమే స్వింగ్ అవ్వడం విశేషం. దీంతో కివీస్ ఓపెనర్లు తొలి వికెట్‌కి 70 పరుగులు జోడించారు..
undefined
భారత స్టార్ పేసర్ బుమ్రా ఏకంగా 3.78 ఎకానమీతో పరుగులు సమర్పించడం, క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. బుమ్రా కంటే షమీ, ఇషాంత్ బాగా బౌలింగ్ చేశారు... మంచి ఫామ్‌లో ఉన్న సిరాజ్‌కి అయినా టీమ్‌లో చోటు కల్పించాల్సిందని టాక్ వినబడుతోంది
undefined
రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఎట్టకేలకు భారత జట్టుకి వికెట్ దక్కింది. 104 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేసిన టామ్ లాథమ్, అశ్విన్ బౌలింగ్‌లో కోహ్లీ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కి అవుటై పెవిలియన్ చేరాడు...
undefined
ఇంగ్లాండ్‌లో అద్భుతమైన రికార్డు ఉన్న భారత నెం.1 స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్‌ను వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఎంపిక చేయకపోవడం ఎంత పెద్ద తప్పిదమో భారత జట్టుకి తెలిసి వచ్చింది..
undefined
2014 టూర్‌లో భారత జట్టు ఘోరంగా విఫలమైనప్పటికీ, ఇంగ్లాండ్ సిరీస్‌లో అదరగొట్టి మూడుసార్లు ఐదేసి వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్, ఆ టూర్‌లో మూడు హాఫ్ సెంచరీలు కూడా చేసి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచాడు.
undefined
అలాంటి భువీని టెస్టుల నుంచి పక్కనబెట్టింది టీమిండియా. పిచ్ స్పింగ్‌కి అనుకూలిస్తున్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ చూపిస్తున్న నిలకడైన బ్యాటింగ్, మనవాళ్ల బౌలింగ్ విఫలం కావడంతో కివీస్‌కి తొలి ఇన్నింగ్స్‌లోనే భారీ ఆధిక్యం దక్కే అవకాశం కనిపిస్తోంది.
undefined
46 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 101 పరుగులు చేసిన న్యూజిలాండ్, తొలి ఇన్నింగ్స్‌లో 300+ పరుగులు చేస్తే మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం ఉంటుంది...
undefined
click me!