నాలుగో రోజూ ఆగని వర్షం... ఇలా అయితే ఫైనల్ మ్యాచ్‌లో రిజల్ట్ రావడం కష్టమే...

Published : Jun 21, 2021, 03:00 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్‌పై వరుణుడు ఏ మాత్రం కరుణ చూపించడం లేదు. ఇప్పటికే రోజున్నరకు పైగా ఆట వర్షం, బ్యాడ్ లైట్ కారణంగా రద్దైన విషయం తెలిసిందే. నాలుగో రోజూ కూడా సౌంతిప్టన్‌లో వర్షం కురుస్తోంది. 

PREV
17
నాలుగో రోజూ ఆగని వర్షం... ఇలా అయితే ఫైనల్ మ్యాచ్‌లో రిజల్ట్ రావడం కష్టమే...

సోమవారం తెల్లవారుజామున సౌంతిప్టన్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో ఆట ఆలస్యంగా ప్రారంభం కానుంది. అయితే వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్టు ప్రకారం చూస్తే మాత్రం నేడు ఆట సజావుగా సాగే అవకాశం లేదు..

27

మొదటి రోజు పూర్తిగా రద్దు కావడంతో రిజర్వు డేని ఐదో రోజుగా పరిగణిస్తే నేడు ఆటలో మూడో రోజు అవుతుంది. అంటే మ్యాచ్‌లో టీమిండియా కమ్‌బ్యాక్ ఇవ్వాలంటే రెండు రోజుల్లో 28 వికెట్లు తీయాల్సి ఉంటుంది...

37

అయితే నిన్న జరిగిన పర్ఫామెన్స్ చూస్తుంటే మనోళ్ల నుంచి ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఆశించడం అత్యాశే అవుతుంది. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్, భారత జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 116 పరుగుల దూరంలో ఉంది.

47

టీమిండియా మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవాలంటే నేడు తొలి సెషన్‌లో కనీసం మూడు వికెట్లు తీయాలి. రెండో సెషన్‌లో న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేయాలి.

57

అప్పుడే భారత జట్టు నేటి సాయంత్రం రెండో ఇన్నింగ్స్ మొదలెట్టేందుకు అవకాశం ఉంటుంది..

67

లేదా ఈ రోజు మొత్తం న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసి 300+ స్కోరు కానీ చేశారా... ఇక మ్యాచ్‌ ఫలితం పూర్తిగా కివీస్ చేతుల్లోకి వెళ్లినట్టే అవుతుంది. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌కి 100+ దక్కితే అది మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది...

77

టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఇన్నింగ్స్‌కంటే ఎక్కువ పరుగులు చేసినా, కివీస్‌కి వచ్చే టార్గెట్ 150+ మాత్రమే ఉంటుంది. అదే జరిగితే న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించగలదు...

click me!

Recommended Stories