ఇంగ్లాండ్‌లా ఆడడం మనవల్ల కాని పని! టీమిండియాకి బజ్‌బాల్ ఆట సెట్ కాదంటున్న దినేశ్ కార్తీక్...

First Published Dec 15, 2022, 12:22 PM IST

కెప్టెన్‌గా బెన్ స్టోక్స్, హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్ బాధ్యతలు తీసుకున్నాక ఇంగ్లాండ్ టెస్టులు ఆడే విధానం పూర్తిగా మారిపోయింది. దూకుడే మంత్రంగా, అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో ‘బజ్‌బాల్’ టెక్నిక్‌ని తీసుకొచ్చిన ఇంగ్లాండ్... వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇలా ఆడడం టీమిండియా వల్ల కాదంటున్నాడు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్...

Image credit: PTI

కెప్టెన్‌గా రోహిత్ శర్మ  బాధ్యతలు తీసుకున్నప్పుడే ‘అగ్రెసివ్ యాటిట్యూడ్’గా ముందుకెళ్తామని కామెంట్ చేశాడు. స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీసుల్లో టీమిండియాలో ఈ అగ్రెసివ్ యాటిట్యూడ్ కనిపించింది. అయితే విదేశాల్లో మాత్రం టీమిండియా తేలిపోయింది...

ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ ఫెయిల్ అయిన టీమిండియా... బంగ్లాదేశ్ పర్యటనలోనూ వన్డే సిరీస్‌ని కోల్పోయింది. రోహిత్ శర్మ గాయపడడంతో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కి కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు కెఎల్ రాహుల్...
 

‘ఇంగ్లాండ్ స్టైల్‌లో బజ్‌బాల్ యాటిట్యూడ్‌ని అలవర్చుకుంటాం. దూకుడుగా ఆడుతూ టెస్టుల్లో డామినేట్ చేస్తాం...’ అంటూ కామెంట్ చేశాడు కెఎల్ రాహుల్. అయితే రాహుల్ వ్యాఖ్యలతో తాను అంగీకరించడం లేదని కామెంట్ చేశాడు దినేశ్ కార్తీక్...

Dinesh Karthik

‘టీమిండియా బజ్‌బాల్ స్టైల్ సూట్ కాదు. ఎందుకంటే ఉపఖండ పిచ్‌లు చాలా స్లోగా ఉంటాయి. స్పిన్నర్లకు అనుకూలిస్తాయి. ఇలాంటి పిచ్‌ల మీద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసి ఆడాల్సిందే. క్రీజులో కుదురుకోవడానికి చాలా సమయం పడుతుంది..

KL Rahul

ఎంత గొప్ప బ్యాట్స్‌మెన్ అయినా దూకుడుగా ఆడాలని ప్రయత్నిస్తే వికెట్ కోల్పోవాల్సి ఉంటుంది. ఇలాంటి వికెట్ల మీద భారీ స్కోరు చేయాలంటే గొప్ప టెక్నిక్ అవసరం లేదు. ఓపిక ఉంటే చాలు. క్రీజులో ఎంత సేపు కుదురుకుపోతే అంత ఎక్కువ పరుగులు చేయడానికి అవకాశం దొరుకుతుంది...

పిచ్ నుంచి సహకారం రానప్పుడు వేగంగా ఆడాలని ప్రయత్నించినా ఫలితం ఉండదు. అందరూ అలాగే ఆడతారని కాదు. రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లు, ఎలాంటి పిచ్‌లో అయినా వేగంగా ఆడగలరు. ఒకరిద్దరు ఇలా ఆడితే ఓకే, అందరూ ఇదే స్టైల్‌లో ఆడాలని చూస్తే... టీమ్‌ స్కోరుపైనే ఆ ఎఫెక్ట్ పడుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు దినేశ్ కార్తీక్...

బజ్ బాల్ స్టైల్‌తో ఆడతామని కామెంట్ చేసిన టీమిండియా టెంపరరీ కెప్టెన్ కెఎల్ రాహుల్ 54 బంతులాడి 3 ఫోర్లతో 22 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. బజ్ బాల్ యాటిట్యూడ్‌తో ఆడడం, మాటలు చెప్పినంత ఈజీ కాదని కెఎల్ రాహుల్‌పై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది...

click me!