ఒకే ఏడాదిలో ముగ్గురు అవుట్! విరాట్‌తో మొదలై, కేన్ విలియంసన్ దాకా! Fab4లో ఒక్కడే మిగిలాడు...

First Published Dec 15, 2022, 10:54 AM IST

ప్రస్తుత తరంలో ఎంతో మంది గొప్ప బ్యాటర్లు ఉన్నా, టెస్టుల్లో సెంచరీల మోత మోగిస్తూ ఫ్యాబులస్ 4 (Fab4) గా గుర్తింపు తెచ్చుకున్నారు విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియంసన్, స్టీవ్ స్మిత్. అయితే 2022 ఏడాది ఈ నలుగురికి వింత అనుభవాన్ని మిగిల్చింది. వీరిలో ముగ్గురు కెప్టెన్సీకి స్వస్తి పలకగా స్టీవ్ స్మిత్ మాత్రం కెప్టెన్‌గా (తాత్కాలిక సారథిగానే) రీఎంట్రీ ఇచ్చాడు.. 

ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికా టూర్‌లో కేప్‌టౌన్ టెస్టు తర్వాత టెస్టు కెప్టెన్సీకి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు విరాట్ కోహ్లీ... 65 మ్యాచుల్లో 40 టెస్టు విజయాలతో ఆల్‌టైం బెస్ట్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్టు కెప్టెన్లలో ఒకడిగా నిలిచిన కోహ్లీ... బీసీసీఐ తనతో ప్రవర్తించిన విధానంతో మనస్థాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నాడు...

Joe root

ఈ ఏడాది ఆరంభంలో యాషెస్ సిరీస్‌లో 4-0 తేడాతో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్, ఆ తర్వాత విండీస్ పర్యటనలోనూ పరాజయాలను చవిచూసింది. వరుస పరాజయాలతో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్... 

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021 టైటిల్ గెలిచిన కేన్ విలియంసన్, న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది 9 మ్యాచులు ఆడితే అందులో రెండే రెండు టెస్టులు గెలిచింది కివీస్. గాయాలతో కేన్ విలియంసన్ చాలా మ్యాచులకు దూరం కావాల్సి వచ్చింది కూడా. అందుకే కేన్ కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు...
 

ఫ్యాబులస్ 4లో తొలుత విరాట్ కోహ్లీ, ఆ తర్వాత జో రూట్, ఏడాది చివర్లో కేన్ విలియంసన్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. అయితే సాండ్ పేపర్ వివాదం తర్వాత కెప్టెన్సీ కోల్పోయిన స్టీవ్ స్మిత్‌కి మాత్రం ఈ ఏడాది కెప్టెన్సీ ఛాన్స్ తిరిగి రావడం విశేషం...
 

Steve Smith

టిమ్ పైన్ సెక్స్ ఛాట్ వివాదంలో ఇరుక్కుని, కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్‌కి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది క్రికెట్ ఆస్ట్రేలియా. యాషెస్ సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన ప్యాట్ కమ్మిన్స్, వైస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ వ్యవహరించాడు. ప్యాట్ కమ్మిన్స్ గాయాలతో జట్టుకి దూరం కావడంతో ఈ ఏడాది రెండు టెస్టులకు కెప్టెన్సీ చేసి విజయాలు అందుకున్నాడు స్టీవ్ స్మిత్...

Fab 4

విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మ టీమిండియా టెస్టు కెప్టెన్సీ తీసుకున్నాడు. అయితే గాయాలతో రోహిత్ శర్మ టీమ్‌కి దూరం కావడంతో ఇంగ్లాండ్‌తో టెస్టుకి జస్ప్రిత్ బుమ్రా, బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కి కెఎల్ రాహుల్ కెప్టెన్లుగా వ్యవహరించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఏడాదిలో రెండే టెస్టులు ఆడింది టీమిండియా...

Ben Stokes

జో రూట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో బెన్ స్టోక్స్ ఆ బాధ్యతలు తీసుకున్నాడు. రూట్ కెప్టెన్సీలో 12 మ్యాచుల్లో 2 విజయాలు అందుకున్న ఇంగ్లాండ్, బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక 8 టెస్టుల్లో ఆరు విజయాలు అందుకుని అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది... 

Pat Cummins

న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్ కేన్ విలియంసన్ నుంచి ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు. టాప్ టీమ్స్‌లో క్రికెట్ ఆస్ట్రేలియాకి ఫాస్ట్ బౌలర్‌గా ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్‌గా ఉంటే, న్యూజిలాండ్ కూడా ఫాస్ట్ బౌలర్ సౌథీకి బాధ్యతలు అప్పగించడం విశేషం.. 

click me!