ఐర్లాండ్‌తోనే ఇంత కష్టపడితే, ఇలాంటి బౌలింగ్‌తో వరల్డ్ కప్ కష్టమే... పొట్టి ప్రపంచకప్‌కి ముందు...

First Published Jun 30, 2022, 11:35 AM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగింది భారత జట్టు. అయితే వరుసగా పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఓడి గ్రూప్ స్టేజీకే పరిమితమైంది. అయితే ఈసారి ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లోనూ భారత జట్టు హాట్ ఫెవరెట్ టీమే... అయితే ఈసారి కూడా భారత జట్టు ప్రదర్శన ఫ్యాన్స్‌ని భయపెడుతోంది..

సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో మొదటి రెండు టీ20 మ్యాచుల్లో భారత బౌలర్లు అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చారు. సిరీస్‌లో పొదుపుగా బౌలింగ్ చేసి, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన భువీ కూడా తొలి టీ20లో భారీగా పరుగులు ఇచ్చాడు...

Harshal Patel

తాజాగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత బౌలర్ల ప్రదర్శన, ఫ్యాన్స్‌కి దిమ్మతిరిగే షాక్‌కి గురి చేసింది. ఐర్లాండ్‌ లాంటి పసి కూన జట్టుపై భారత బౌలర్లు మూకమ్మడిగా ఫెయిల్ అయ్యారు. పొదుపుగా బౌలింగ్ చేసే భువీ కూడా 4 ఓవర్లలో 46 పరుగులు సమర్పించాడు...

Image credit: PTI

డెత్ ఓవర్ స్పెషలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న హర్షల్ పటేల్‌ని కూడా ఓ ఆటాడుకున్నాడు ఐర్లాండ్ బ్యాటర్లు. హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకున్నాడు... స్పిన్నర్ అక్షర్ పటేల్ మినహా మిగిలిన బౌలర్లు అందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు...

Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడే జట్టులో పక్కగా ఉంటారని భావిస్తున్న భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ 11+ ఎకానమీతో పరుగులు ఇవ్వడంతో అభిమానుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నారు. ఐర్లాండ్‌పైనే ఇలా పరుగులు ఇస్తే, ఆస్ట్రేలియా పిచ్‌ల మీద టాప్ క్లాస్ టీమ్‌తో ఆడితే పరిస్థితి ఏంటి?...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం బౌలర్ల ఫెయిల్యూర్. పాకిస్తాన్‌పై వెంటవెంటనే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా 151 పరుగుల ఓ మాదిరి మంచి స్కోరే చేయగలిగింది టీమిండియా. అయితే భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు...

భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ భారీగా పరుగులు ఇవ్వడంతో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్ చేతుల్లో మొట్టమొదటి సారి ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది భారత జట్టు. 

ఇప్పుడు మనోళ్ల బౌలింగ్ పర్ఫామెన్స్ చూస్తుంటే, ఈసారి కూడా అలాంటి ఫెయిల్యూర్ రిపీట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

Image credit: PTI

ఆడుతుంది ఇక్కడైనా, ఎక్కడైనా... ఐర్లాండ్‌ వంటి టీమ్‌పై 225 పరుగుల భారీ స్కోరు కొట్టిన తర్వాత 4 పరుగుల తేడాతో చచ్చీ చెడీ గెలవడం అంటే అది విజయం కిందకే రాదు. టీమిండియాపై 221 పరుగుల స్కోరు చేసినప్పుడే ఐర్లాండ్ ఓ విధంగా గెలిచేసింది...

Image credit: PTI

ఓ మ్యాచ్‌లో నిప్పులు చెదిరే బంతులతో బౌలింగ్ చేసి, ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ వంటి బౌలర్లు, ఆ తర్వాతి మ్యాచుల్లో వేడి చల్లారిపోయినట్టు భారీగా పరుగులు ఇచ్చేస్తూ ఫెయిల్ అవుతున్నారు..

ఇదే రకమైన బౌలింగ్ అటాక్‌తో, ఇదే యాటిట్యూడ్‌తో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో బరిలో దిగితే మాత్రం భారత జట్టుకి మరోసారి చేధు అనుభవం ఎదురుకావచ్చని హెచ్చరిస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్..

click me!