కెఎల్ రాహుల్ సర్జరీ సక్సెస్‌ఫుల్... జర్మనీలో గర్ల్‌ఫ్రెండ్ అథియా శెట్టితో కలిసి...

Published : Jun 30, 2022, 10:40 AM IST

టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాడు భారత ఓపెనర్ కెఎల్ రాహుల్. గాయం కారణంగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి దూరంగా ఉన్న కెఎల్ రాహుల్, ఇంగ్లాండ్‌తో నిర్ణయాత్మక ఐదో టెస్టుకి దూరమయ్యాడు. భారత ప్రధాన జట్టు ఇంగ్లాండ్ టూర్‌లో ఉంటే, మరో జట్లు ఐర్లాండ్ టూర్ ముగించుకుంది...

PREV
17
కెఎల్ రాహుల్ సర్జరీ సక్సెస్‌ఫుల్... జర్మనీలో గర్ల్‌ఫ్రెండ్ అథియా శెట్టితో కలిసి...

కెఎల్ రాహుల్ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు జర్మనీ వెళ్లాడు. మూడు రోజుల క్రితం గర్ల్ ఫ్రెండ్ అథియా శెట్టితో కలిసి జర్మనీ బయలుదేరి వెళ్లి లోకేశ్ రాహుల్, సర్జరీ పూర్తయ్యిందంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియచేశాడు...

27

‘ఈ రెండు వారాలు చాలా కష్టంగా గడిచాయి. ఎట్టకేలకు సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది. నేను వేగంగా కోలుకుంటున్నాను.. త్వరలోనే జట్టులోకి వచ్చేందుకు రెఢీ అవుతున్నా... నా కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు... సీ యూ సూన్’ అంటూ ట్వీట్ చేశాడు కెఎల్ రాహుల్..

37

ఇంతకుముందు గాయం కారణంగా జట్టుకి దూరమైనప్పుడల్లా గర్ల్‌ఫ్రెండ్ అథియా శెట్టితో కలిసి చక్కర్లు కొడుతూ కనిపించిన కెఎల్ రాహుల్, సర్జరీ కోసం జర్మనీకి వెళ్లిన సమయంలోనూ ఆమెను వెంటబెట్టుకెళ్లడంతో సోషల్ మీడియాలో అనేక రకాలుగా ట్రోల్స్ వినిపిస్తున్నాయి...

47

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా ఎంపికైన కెఎల్ రాహుల్, మొదటి టీ20 ఆరంభానికి ముందు గాయంతో తప్పుకోవడంతో అతని స్థానంలో రిషబ్ పంత్.. టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే...

57

తాజాగా ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకి కూడా కెఎల్ రాహుల్ దూరం కావడం, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా పాజిటివ్‌గా తేలడంతో భారత బ్యాటింగ్ లైనప్ కాస్త వీక్ అయినట్టే కనిపిస్తోంది.. రోహిత్ శర్మకు స్టాండ్‌బై ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ ఇప్పటికే టీమిండియాలో చేరిపోయాడు...
 

67

రోహిత్ శర్మ కోలుకోవడం అనుమానంగా మారడంతో ఇంగ్లాండ్‌తో జరిగే ఐదో టెస్టులో శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా వ్యవహరించే అవకాశం ఎక్కువగా ఉంది..

77
Rohit Sharma

కరోనా బారిన పడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఐదో టెస్టు సమయానికి కోలుకోకపోయినా ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగే వైట్ బాల్ సిరీస్‌కి అందుబాటులోకి రానున్నాడు. శస్త్ర చికిత్స పూర్తయినా కెఎల్ రాహుల్ పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని అంచనా. దీంతో అతను ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌కి కూడా దూరం కాబోతున్నాడు..

click me!

Recommended Stories