Virat Kohli: కోహ్లి రికార్డులను బ్రేక్ చేస్తున్న పాకిస్తాన్ సారథి.. మరో అరుదైన ఘనత సొంతం

Published : Jun 29, 2022, 04:03 PM ISTUpdated : Jun 29, 2022, 04:04 PM IST

Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్ విరాట్ కోహ్లి రికార్డులమీద కన్నేశాడు. వరుసగా అతడికి సంబంధించిన ఒక్కో రికార్డును అధిగమిస్తున్నాడు. 

PREV
16
Virat Kohli: కోహ్లి రికార్డులను బ్రేక్ చేస్తున్న పాకిస్తాన్ సారథి.. మరో అరుదైన ఘనత సొంతం

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి  గత దశాబ్దంలో భీభత్సమైన ఫామ్ లో ఉండేవాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించేవాడు. కానీ గడిచిన రెండున్నరేండ్లుగా అతడి బ్యాట్ నుంచి పరుగుల రాకే కరువైంది. కానీ ఇదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ మాత్రం తన కెరీర్ లో పీక్స్ అనుభవిస్తున్నాడు. 

26

గత కొన్నాళ్లుగా  మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న బాబర్..  గతంలో కోహ్లి నెలకొల్పిన రికార్డులను బద్దలుకొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఇటీవలే వెస్టిండీస్ తో వన్డే సిరీస్ సందర్బంగా  కెప్టెన్ గా తక్కువ (13) ఇన్నింగ్స్ లలోనే వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు (17 వన్డేలలో వెయ్యి పరుగులు) కోహ్లి పేరిట ఉండేది. 

36

ఇక తాజాగా  అతడు.. కోహ్లికి చెందిన మరో రికార్డును కూడా అధిగమించాడు. టీ20లలో అత్యధిక రోజులు నెంబర్ వన్ గా ఉన్న రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు. కోహ్లి.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో 1,013 రోజుల పాటు నెంబర్ వన్  బ్యాటర్ గా కొనసాగాడు. 

46

ఇప్పుడు బాబర్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. గడిచిన  మూడేండ్లుగా అతడు టీ20లలో నెంబర్ వన్ గా కొనసాగుతున్న అతడు  బుధవారంతో 1,014 రోజుల పాటు ఈ పొజిషన్ లో ఉన్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 
 

56

టీ20తో పాటు వన్డేలలో కూడా బాబర్ అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ఐసీసీ తాజాగా విడుదల చేసిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో  బాబర్ 818 పాయింట్లతో ప్రథమ స్థానంలో ఉన్నాడు.  మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్ వికెట్ కీపర్) 794 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

66

ఇక ఈ జాబితాలో భారత జట్టు నుంచి టాప్-10 లో ఇషాన్ కిషన్ (682 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు) ఒక్కడే నిలిచాడు.  బౌలర్లలో హెజిల్వుడ్ (ఆసీస్), అదిల్ రషీద్ (ఇంగ్లాండ్), రషీద్ ఖాన్ (ఆఫ్ఘానిస్తాన్) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో ఒక్క భారత బౌలర్ కూడా లేడు.  

Read more Photos on
click me!

Recommended Stories