సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ద్వారా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చి, బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్నాడు ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున 76 మ్యాచులు ఆడిన రషీద్ ఖాన్, 6.35 ఎకానమీతో 93 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ 222 పరుగులు చేశాడు.
2017లో రషీద్ ఖాన్‌ని రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. రషీద్ ఖాన్ 3 వికెట్లు తీసిన దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాలు అందుకుంది...
28
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున భువనేశ్వర్ కుమార్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఉన్న రషీద్ ఖాన్‌ని ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో స్థానం దొరకలేదు...
38
కెప్టెన్ కేన్ విలియంసన్‌ను రూ.12 కోట్లకి రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... ఆన్‌క్యాప్డ్ ప్లేయర్లు (ఒక్కొక్కరికీ రూ.4 కోట్లు) అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను అట్టిపెట్టుకుంది...
48
Rashid Khan
పీఎస్‌ఎల్‌లో రూ.కోటి 70 లక్షలు తీసుకుంటున్న రషీద్ ఖాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ నుంచి మొదటి రిటెన్షన్‌గా రూ.15 కోట్లు డిమాండ్ చేశాడని టాక్ వినిపించింది...
58
Muttiah Muralitharan
తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్ బౌలింగ్ కోచ్, శ్రీలంక మాజీ క్రికెట్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ చేసిన కామెంట్లు చూస్తే ఈ వార్తలు నిజమేనని అనిపిస్తోంది.
68
‘రషీద్ ఖాన్‌పై మేం పగ, ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవడం లేదు కానీ మేం అతను అడిగినంత ఇవ్వలేకపోయాం...’ అంటూ కామెంట్ చేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్...
78
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు, రషీద్ ఖాన్‌ని రూ.15 కోట్లు ఇచ్చి డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే...
88
తన పాత టీమ్ ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 28 పరుగులిచ్చిన రషీద్ ఖాన్, 42 పరుగులు చేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్ తీశాడు..