అది నా తప్పు కాదు.. మా ప్రిన్సిపల్ వల్ల అలా.. తన పేరులో తప్పుపై అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Apr 12, 2022, 06:09 PM IST

Axar Patel: టీమిండియాకు దొరికిన మరో  స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్.  ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న ఈ గుజరాతీ కుర్రాడు.. తన పేరులో గల తప్పు గురించి ఆసక్తికర  విషయాలు వెల్లడించాడు. 

PREV
17
అది నా తప్పు కాదు.. మా ప్రిన్సిపల్ వల్ల అలా.. తన పేరులో తప్పుపై అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్-15లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న  అక్షర్ పటేల్.. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా ఇరగదీస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచిన రెండు మ్యాచుల్లో (ముంబై, కోల్కతా)  అక్షర్ మెరిశాడు

27

కాగా పిలవడానికి ఇబ్బంది లేకున్నా రాసేప్పుడు మాత్రం ఇంగ్లీష్ లో అక్షర్ పటేల్  పేరును ‘AKSHAR’ అని కాకుండా  ‘AXAR’ అని రాస్తాడు. దీనిపై క్రికెట్ అభిమానుల్లో కూడా సందేహాలున్నాయి. అయితే ఇది తప్పు అని  స్వయంగా అతడే వెల్లడించాడు.  

37

అక్షర్ తాజాగా ఓ యూట్యూబ్ లో ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించాడు. అతడు మాట్లాడుతూ... ‘సాధారణంగా అయితే  ఇంగ్లీష్ లో నా పేరును ‘AKSHAR’ అనే రాయాలి. అదే కరెక్ట్. 

47

కానీ నేను టీమిండియా అండర్-19 క్యాంప్ కోసం బెంగళూరులో ఉన్నాను. ప్రపంచకప్   సన్నాహకాల్లో భాగంగా.. అందరూ ఆటగాళ్లంతా ఆస్ట్రేలియా వెళ్లడానికి పాస్ పోర్టులు సిద్ధం చేసుకుంటున్నారు. 

57

అయితే నాకు పాస్ పోర్ట్ లేదు. అది కావాలంటే నా స్కూల్ నుంచి టీసీ తో పాటు లైసెన్స్ కూడా కావాలని సూచించారు. నేను నేరుగా మా స్కూల్ కు వెళ్తే.. మా  ప్రిన్సిపల్ ఆ సర్టిఫికెట్ లో నా పేరును ‘AKSHAR’ కు బదులుగా ‘AXAR’ అని రాశాడు.  

67

కానీ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో అధికారులు మాత్రం ఇదేంటి  పేర్లలో తేడా ఉంది అని  నన్ను ప్రశ్నించారు. నేను వెంటనే  మా నాన్నకు ఫోన్ చేశాను. అప్పుడు మా నాన్న వాళ్లతో.. ఇప్పుడు మార్చాల్సిందేమీ లేదు. ఇక అదే ఫిక్స్ అని  వాళ్లతో చెప్పాడు. 

77

ఆ తర్వాత నేను ముంబై ఇండియన్స్ కు ఆ తర్వాత టీమిండియా కు ఆడాను.  ఇంగ్లీష్ లో నా పేరు ‘AXAR’ గానే స్థిరపడిపోయింది..’ అని చెప్పుకొచ్చాడు. 

click me!

Recommended Stories