TATA IPL: ఐపీఎల్ చూస్తుంటే చిరాకేస్తోంది.. సీఎస్కే ఆల్ రౌండర్ షాకింగ్ కామెంట్స్

Published : Mar 31, 2022, 03:26 PM IST

TATA IPL 2022- CSK vs LSG: ఐపీఎల్ లో మూడు సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ఆల్ రౌండర్ సామ్ కరన్ లీగ్  పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ ను చూస్తుంటే విసుగొస్తుందని, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదని వ్యాఖ్యానించాడు. 

PREV
17
TATA IPL: ఐపీఎల్ చూస్తుంటే చిరాకేస్తోంది.. సీఎస్కే ఆల్ రౌండర్ షాకింగ్ కామెంట్స్

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున  ఆల్ రౌండర్ గా ఎదిగిన  ప్రముఖ ఇంగ్లాండ్ ఆటగాడు సామ్ కరన్  ఈ లీగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ఇంట్లో కూర్చుండి లీగ్ ను చూస్తే చిరాకొస్తుందని వ్యాఖ్యానించాడు. గతేడాది వెన్నునొప్పి కారణంగా 2021 సీజన్ రెండో దశలో అర్థాంతరంగా వైదొలిగిన ఈ యువ ఆల్ రౌండర్.. ఆ తర్వాత మళ్లీ ఫీల్డ్ లోకి రాలేదు. అయితే ఐపీఎల్ మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో అతడు స్పందించాడు. 

27

ఓ క్రీడా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ కరన్ మాట్లాడుతూ.. ‘నేనుు అక్కడ (ఐపీఎల్ లో) లేనందుకు  చాలా బాధపడుతున్నాను.  ఇంటి నుంచి ఐపీఎల్ చూస్తుంటే చాలా నిరాశగా ఉంది. అటువంటి లీగ్ లో నేను భాగం కాకపోయినందుకు చిరాగ్గా ఉంది. 

37

నేను వేలంలోకి వెళ్లాలనుకున్నాను. కానీ నా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చివరి నిమిషంలో మనసు మార్చుకున్నాను.  అయితే ఇది ఉత్తమమైన నిర్ణయమే అని నేను అనుకుంటున్నాను. ఈసారి ఐపీఎల్ చాలా త్వరగా వచ్చింది. ఇక నా ఆరోగ్యం గురించి చెప్పాల్సి వస్తే.. ఇప్పుడిప్పుడే నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒకవేళ  ఈ ఫిట్నెస్ తో నేను ఐపీఎల్ కు వెళ్లుంటే అక్కడ బౌలింగ్ చేసేవాడిని.  కానీ ఒకవేళ మళ్లీ గాయపడితే అది మొదటికే మోసం రావొచ్చు. అందుకే నేను ఈ సారి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాను. 

47

అవకాశం వస్తే తప్పకుండా ఐపీఎల్ లో ఆడేందుకు ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఐపీఎల్ వంటి టోర్నీలలో ఆడిత టీ20 క్రికెట్ గురించి చాలా నేర్చుకునే వీలుంది.  అక్కడ క్రికెట్టే శ్వాస, ధ్యాస.బ్రేక్ ఫాస్ట్ కు వెళ్లే సమయంలో కూడా పెద్ద పెద్ద ఆటగాళ్లతో కలిసి క్రికెట్ గురించే మాట్లాడతాం.   ఆట గురించే కబుర్లు చెప్పుకుంటారు. ఒక యువ ఆటగాడిగా  అది నాకు చాలా అవసరం. నేను నేర్చుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుంది..’ అని సామ్ చెప్పాడు. 

57

కాగా.. 2021 సీజన్ రెండో దశ (దుబాయ్) లో గాయపడి అర్థాంతరంగా సీజన్ నుంచి వైదొలిగిన కరన్.. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఆ తర్వాత  యాషెస్, ఇతర సిరీస్ లకు కూడా దూరంగానే ఉన్నాడు. 

67

అయితే  ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకోవాలనుకున్నా అతడు మాత్రం చివరి నిమిషంలో మనసు మార్చుకున్నాడు.   మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని తన వైద్య బృందం తేల్చడంతో అతడు వేలం నుంచి తప్పుకున్నాడు.

77

2020 నుంచి సీఎస్కేకు ఆడుతున్న  మొత్తంగా ఐపీఎల్ లో  32 మ్యాచులాడాడు. బ్యాటింగ్ లో 337 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 32 వికెట్లు తీసుకున్నాడు. 

click me!

Recommended Stories