Published : Mar 31, 2022, 02:43 PM ISTUpdated : Mar 31, 2022, 02:44 PM IST
TATA IPL2022 - CSK vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో.. అరుదైన రికార్డును సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. నేటి మ్యాచులో ఒక్క వికెట్ తీస్తే అతడు...
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో చరిత్ర సృష్టించేందుకు ఒక్క వికెట్ దూరంలో నిలిచాడు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా సరికొత్త చరిత్ర లిఖించేందుకు అతడికి ఒక్క వికెట్ కావాలి.
28
నేడు రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగబోయే మ్యాచులో బ్రావో ఒక్క వికెట్ తీస్తే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఈ రికార్డును అందుకుంటాడు.
38
ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్, ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న లసిత్ మలింగ.. 170 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
48
ఐపీఎల్ లో 122 మ్యాచులాడిన మలింగ.. 170 వికెట్లతో ఉన్నాడు. అయితే ఇటీవలే కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో మూడు వికెట్లు తీయడం ద్వారా బ్రావో (170) ఈ రికార్డును సమం చేశాడు. 170 వికెట్లను తీయడానికి బ్రావోకు 151 మ్యాచులు అవసరమయ్యాయి.
58
కేకేఆర్ తో మ్యాచులో వెంకటేశ్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్, నితీష్ రాణాలను ఔట్ చేయగానే బ్రావో.. మలింగ రికార్డును సమం చేశాడు. ఇక నేటి లక్నో మ్యాచులో ఒక్క వికెట్ తీసినా అది చరిత్రే కానుంది.
68
ఇక ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో మలింగ (170), బ్రావో (170) తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ బౌలర్ అమిత్ మిశ్రా (166 వికెట్లు), పియుష్ చావ్లా (157), హర్భజన్ సింగ్ (150) ఉన్నారు.
78
కాగా నేడు లక్నోతో జరుగబోయే మ్యాచులో విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టాలని సీఎస్కే భావిస్తున్నది. గత మ్యాచులో రవీంద్ర జడేజా సారథ్యంలోని సీఎస్కే.. కేకేఆర్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే.
88
మరోవైపు ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో కూడా తమ తొలి మ్యాచులో గుజరాత్ చేతిలో పరాభవాన్ని మర్చిపోయి విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. రెండు దెబ్బతిన్న పులులు.. నేడు రాత్రి 7.30 గంటలకు బ్రబోర్న్ స్టేడియంలో తలపడబోతున్నాయి.