TATA IPL: ధోని కెప్టెన్సీ నుంచి వైదొలగడం గురించి అప్పుడే మాట్లాడుకున్నాం.. సీఎస్కే హెడ్ కోచ్ కామెంట్స్

Published : Mar 27, 2022, 01:44 PM IST

TATA IPL2022 Live Updates: ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి గతేడాది వరకు  చెన్నై సూపర్ కింగ్స్ ను నిరాటంకంగా నడిపించిన  ధోని.. ఈ ఏడాది నుంచి సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. 

PREV
18
TATA IPL: ధోని కెప్టెన్సీ నుంచి వైదొలగడం గురించి అప్పుడే మాట్లాడుకున్నాం.. సీఎస్కే హెడ్ కోచ్ కామెంట్స్

ఐపీఎల్-2022 సీజన్ కు  నాలుగు రోజుల ముందు  సారథ్య బాధ్యతలను రవీంద్ర జడేజా కు అప్పజెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు మహేంద్ర సింగ్ ధోని.

28

అయితే  ఈ నిర్ణయం ధోని అప్పటికప్పుడుగా తీసుకున్నదేమీ కాదు. దీని వెనుక కూడా పెద్ద మేధో మదనమే జరిగిందట. అందుకు సంబంధించిన విషయాలను చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించాడు.

38

వాంఖెడే లో సీఎస్కే-కేకేఆర్ మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్ మాట్లాడుతూ... ‘గతేడాది ఐపీఎల్ కప్ గెలిచిన తర్వాత ధోని ఈ ప్రతిపాదన తీసుకొచ్చాడు. సీజన్ ముగిశాక  అతడు నాతో పాటు సీఎస్కే అధినేత శ్రీనివాసన్ తో చెప్పాడు. 

48

అది ధోని స్వయంగా తీసుకున్న నిర్ణయం. సీజన్ ముగింపు దశలో  రవీంద్ర జడేజా కు సారథ్యం అప్పజెప్పడం గురంచి నాతో చర్చించాడు. అయితే కెప్టెన్ గా వైదొలుగుతానని చెప్పిన ధోని నిర్ణయాన్ని మేమంతా  వంద శాతం గౌరవించాం..’ అని చెప్పాడు. 

58

2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి 2021 సీజన్ వరకు ధోని చెన్నైకి సారథిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక 2009 నుంచి ఫ్లెమింగ్ కూడా ఆ జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఇద్దరికీ మంచి బాండింగ్ ఉంది. 

68

జడేజా ఈ సీజన్ నుంచే కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పినందున అతడు నేర్చుకోవడానికి కొంతకాలం పడుతుందని, ఒక్క మ్యాచుకే అతడి  కెప్టెన్సీ సామర్థ్యాన్ని అంచనావేయలేమని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు. కుదురుకున్నాక జడేజాలోని మరో కోణాన్ని చూడటం ఖాయమని ఫ్లెమింగ్ తెలిపాడు. 

78

ఇక  శనివారం కోల్కతా నైట్ రైడర్స్ తో వాంఖెడే లో జరిగిన  మ్యాచ్ పై ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచుకు మా అంచనా తప్పింది.  రాత్రి పూట  కొంచెం మంచు వల్ల  ఫలితం తమకు అనుకూలంగా రాలేదు. పరిస్థితులు కూడా కఠినంగా ఉన్నాయి. గతేడాది కూడా ఇలాగే ప్రారంభించాం.  కానీ  తర్వాత మేం పుంజుకున్నాం..’ అని అన్నాడు. 

88

కేకేఆర్ తో మ్యాచ్ ఓడిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్.. తమ తర్వాతి  మ్యాచ్ మార్చి 31 (గురువారం)న బ్రబౌర్న్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్‌తో తలపడేందుకు సిద్ధమవుతున్నది. 

Read more Photos on
click me!

Recommended Stories