అట్లుంటది మరి మాహీతోని... రెండేళ్ల తర్వాత హాఫ్ సెంచరీ కొట్టి, ద్రావిడ్ రికార్డు బ్రేక్...

Published : Mar 26, 2022, 11:25 PM IST

ఎమ్మెస్ ధోనీ... గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో, టీమిండియాలో బీభత్సమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న ప్లేయర్. జిడ్డు బ్యాటింగ్‌తో మ్యాచ్ చూసే ప్రేక్షకులకు విసిగిస్తున్నాడని, మాహీ టైం అయిపోయిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపించాయి. అయితే వాటన్నింటికీ తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు మాహేంద్ర సింగ్ ధోనీ...

PREV
111
అట్లుంటది మరి మాహీతోని... రెండేళ్ల తర్వాత హాఫ్ సెంచరీ కొట్టి, ద్రావిడ్ రికార్డు బ్రేక్...

ఐపీఎల్‌లో తొలిసారి సీఎస్‌కే తరుపున నాన్ కెప్టెన్‌గా బరిలో దిగిన ఎమ్మెస్ ధోనీ, సాధారణ ప్లేయర్‌గా ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే ధనాధన్ బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ సాధించాడు...

211

ఐపీఎల్‌లో చివరిగా 2019 సీజన్‌లో ఆర్‌సీబీపై బెంగళూరులో 48 బంతుల్లో 84 పరుగులు చేసిన ఎమ్మెస్ ధోనీ, గత రెండు సీజన్లలో హాఫ్ సెంచరీ సాధించలేకపోయాడు. గత ఐపీఎల్‌లో అయితే మాహీ అత్యధిక స్కోరు 18 పరుగులే...

311

ఐపీఎల్ 2022 సీజన్‌లో కూడా మాహీపై పెద్దగా అంచనాలు లేవు. కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవడంతో మాహీ బ్యాటు నుంచి మెరుపులు చూసే అవకాశం దొరుకుతుందని ఎవ్వరూ అంచనా వేయలేదు కూడా...

411

ఇన్నింగ్స్ మొదట్లో నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుండడంతో మాహీని తాబేలుతో పోలిస్తే... హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేసేందుకు ప్రయత్నించారు ధోనీ హేటర్స్... 
 

511

అయితే  ఆండ్రే రస్సెల్ వేసిన 18వ ఓవర్‌లో 3 ఫోర్లతో 14 పరుగులు రాబట్టిన ఎమ్మెస్ ధోనీ, శివమ్ మావి వేసిన 19వ ఓవర్‌లో ఓ ఫోర్, సిక్సర్‌తో 15 పరుగులు రాబట్టాడు...

611

రస్సెల్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాది, కెరీర్‌లో 24వ హాఫ్ సెంచరీ అందుకున్నాడు ఎమ్మెస్ ధోనీ. 38 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో మహీ 50 పరుగులు చేసిన మాహీ, ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు...

711

ఐపీఎల్‌లో అతి పెద్ద వయసులో హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఎమ్మెస్ ధోనీ. ధోనీ వయసు ప్రస్తుతం 40 ఏళ్ల 262 రోజులు...

811

ఐపీఎల్‌లో 40 ఏళ్లు దాటిన తర్వాత నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన రాహుల్ ద్రావిడ్, 40 ఏళ్ల 116 రోజుల వయసులో ఆఖరి హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ రికార్డును బ్రేక్ చేశాడు ఎమ్మెస్ ధోనీ...

911

ఐపీఎల్ తప్ప మరో లీగ్ ఆడని ఎమ్మెస్ ధోనీ, వస్తూనే హాఫ్ సెంచరీ కొట్టడంపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ‘ధోనీ బ్రిలియెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. సంవత్సరమంతా క్రికెట్‌కి దూరంగా ఉండి, వచ్చి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడమంటే మాటలు కాదు...’ అంటూ ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్...

1011

2020 సీజన్‌లో ఎమ్మెస్ ధోనీ 47 పరుగులతో నాటౌట్‌గా ఉన్నప్పుడు, ‘కొందరికి టాలెంట్‌ చూపించడానికి వయసుతో పనిలేదంటారు, మరికొందరిని వయసు సాకుతో పక్కనబెట్టేస్తారు..’ అంటూ ట్రోల్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్...

1111

సరిగా రెండేళ్ల తర్వాత అదే ఇర్ఫాన్ పఠాన్, మాహీని పొడుగుతూ ట్వీట్ చేయడంతో ధోనీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ‘అట్లుంటది మరి మా మాహీతోనీ’ అంటూ పోస్టులు చేస్తున్నారు... 

Read more Photos on
click me!

Recommended Stories