ICC Women's World Cup 2022: భారత మహిళల జట్టు సారథి మిథాలీ రాజ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆరో ప్రపంచకప్ ఆడుతున్న ఆమె దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో హాఫ్ సెంచరీ చేసి ఈ రికార్డు సొంతం చేసుకుంది.
టీమిండియా మహిళల క్రికెట్ జట్టు సారథి వెటరన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో హాఫ్ సెంచరీతో కదం తొక్కడంతో ఆమె ఈ ఘనత సాధించింది.
26
ఈ మ్యాచులో మిథాలీ రాజ్.. 84 బంతుల్లో 68 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచకప్ లో అతి చిన్న వయసుతో పాటు అతి పెద్ద వయసులో కూడా హాఫ్ సెంచరీ చేసిన క్రీడాకారిణిగా ఆమె రికార్డులకెక్కింది.
36
భారత్ తరఫున అతి తక్కువ వయసులో ప్రపంచకప్ లో హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్ మిథాలీనే... 2000 లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ లో మిథాలీ.. ఇదే దక్షిణాఫ్రికా మీద అర్థ సెంచరీ చేసింది.
46
ఇక తాజాగా 2022 లో జరుగుతున్న వరల్డ్ కప్ లో కూడా 39 ఏండ్ల మిథాలీ.. తొలి హాఫ్ సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా మీదే తిరిగి అర్థ శతకం సాధించడం గమనార్హం.
56
కాగా.. ఈ మ్యాచులో టీమిండియా మిథాలీ తో పాటు ఓపెనర్లు స్మృతి మంధాన (71), షఫాలీ వర్మ (53) లు కూడా మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించిన విషయం తెలిసిందే.
66
ఈ ముగ్గురు హాఫ్ సెంచరీలే గాక ఆల్ రౌండర్ హర్మన్ ప్రీత్ కౌర్ (48) కూడా మెరవడంతో భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.