IPL 2022: నువ్వు వికెట్ తీయి.. నేను నిన్ను ఫోటో తీస్తా.. ఎస్ఆర్హెచ్-ఆర్ఆర్ మ్యాచులో చాహల్ దంపతుల హంగామా

Published : Mar 30, 2022, 04:59 PM IST

TATA IPL 2022: ఐపీఎల్-2022 లో భాగంగా మంగళవారం పూణె వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్- రాజస్థాన్ రాయల్స్ మధ్య  జరిగిన మ్యాచులో  యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ దంపతులు హంగామా చేశారు. 

PREV
17
IPL 2022: నువ్వు వికెట్ తీయి.. నేను నిన్ను ఫోటో తీస్తా.. ఎస్ఆర్హెచ్-ఆర్ఆర్ మ్యాచులో  చాహల్ దంపతుల హంగామా

ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా క్రికెటర్లు తమ భార్యలను  మ్యాచులకు తీసుకురావడం ఇటీవల కాలంలో సహజమైపోయింది. కొంతమంది క్రికెటర్లు తమ గర్ల్ ఫ్రెండ్స్ తో పాటు కాబోయే సతీమణులను కూడా  మ్యాచులకు తీసుకొస్తారు.

27

కాగా.. పూణె వేదికగా  ఎస్ఆర్హెచ్-రాజస్థాన్ రాయల్స్  మ్యాచులో రాజస్థాన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ  మెరిసింది.  తన భర్త వికెట్లు తీసినప్పుడల్లా ఆమె అందుకు సంబంధించిన ఫోటోలను  తన ఫోన్ లో క్లిక్ మనిపించింది. 

37

ఈ మ్యాచులో చాహల్ 4 ఓవర్లు  బౌలింగ్ చేసి 22 పరుగులిచ్చి అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రొమారియో షెపర్డ్ లను ఔట్ చేశాడు.  తద్వారా టీ20 క్రికెట్ (అంతర్జాతీయ, లీగ్ లు) లలో కలిపి 250 వికెట్లను సాధించిన నాలుగో భారత బౌలర్ గా నిలిచాడు. 

47

ఈ జాబితాలో అశ్విన్ (264 వికెట్లు), అమిత్ మిశ్రా (260), పియుష్ చావ్లా (262) లు చాహల్ కంటే ముందున్నారు. ఎస్ఆర్హెచ్  బ్యాటర్ షెఫర్డ్ ను ఔట్ చేయడం ద్వారా చాహల్ ఈ రేర్ ఫీట్ ను సాధించాడు. 

57

కాగా.. నిన్నటి మ్యాచులో ధన శ్రీ వర్మ ఫోటోలు తీస్తుండగా వీడియో కెమెరాలు  ఈ దంపతుల మీదే ఫోకస్ చేశాయి. ఇక ఇప్పుడు ఇదే ఫోటోలను రాజస్థాన్ రాయల్స్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 
 

67

ధనశ్రీ ఫోటో తీస్తున్న చిత్రంతో పాటు ఆమె ఫోటో తీసేప్పుడు చాహల్ ఫ్లయింగ్ కిస్ ఇస్తున్న ఫోటోలను  తన సామాజిక మాధ్యమ ఖాతాలలో   పోస్ట్ చేసింది రాజస్థాన్ రాయల్స్. దీనికి ‘నువ్వు వికెట్లు తీయి.. నేను నిన్ను ఫోటోలు తీస్తా...’ అని రాసుకొచ్చింది. 

77

ఇదిలాఉండగా.. మంగళవారం నాటి మ్యాచులో రాజస్థాన్ రాయల్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ మీద 61 పరుగుల   తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన  రాజస్థాన్.. 6 వికెట్ల నష్టానికి  210 పరుగులు చేసింది. అనంతరం ఎస్ఆర్హెచ్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు  మాత్రమే చేయగలిగింది. 

click me!

Recommended Stories