సీజన్ మారింది, టీమ్ మారింది... మనోళ్ల ఆట మాత్రం ఏం మారలే! ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్...

Published : Mar 29, 2022, 10:19 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచి, ఘోర పరాభవాన్ని చవిచూసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. మూడంటే మూడు మ్యాచుల్లో మాత్రమే విజయాలు అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకుంది...అయితే రిజల్ట్ మాత్రం తేడా కొట్టేసినట్టే కనిపిస్తోంది.

PREV
19
సీజన్ మారింది, టీమ్ మారింది... మనోళ్ల ఆట మాత్రం ఏం మారలే! ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్...

అనుకున్నట్టే కెప్టెన్ కేన్ విలియంసన్‌ని మినహా మిగిలిన అందరినీ వేలానికి వదిలేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్... నటరాజన్, భువనేశ్వర్ కుమార్, అభిషేక్ శర్మ వంటి ప్లేయర్లను తిరిగి కొనుగోలు చేసింది...

29

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు నికోలస్ పూరన్ బీభత్సమైన ఫామ్‌లో ఉండడం... టీ10 టోర్నీలో సెంచరీ చేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కొన్ని ఆశలు చిగురించాయి...

39

అయితే మొదటి మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఆటతీరు, ఐపీఎల్ 2021 సీజన్‌ని గుర్తుకు తెస్తోంది. బౌలింగ్‌లో వరుసగా నో బాల్స్ వచ్చి, రాజస్థాన్ రాయల్స్‌కి 210 పరుగుల భారీ స్కోరు అప్పగించింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

49

అయితే ఇప్పటిదాకా ఐపీఎల్ 2022 సీజన్‌లో జరిగిన మొదటి నాలుగు మ్యాచుల్లో టాస్ గెలిచి రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టునే విజయం వరించింది. ఆర్‌సీబీపై పంజాబ్ కింగ్స్ 200+ టార్గెట్‌ను ఛేదించింది...

59

దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందేమో... అనే ఆశ ఏ మూలనో మిగిలి ఉంది. అయితే ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌ ఆశలపై నీళ్లు గుమ్మరించారు బ్యాటర్లు...

69

కెప్టెన్ కేన్ విలియంసన్ 7 బంతులాడి 2 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అవుట్ కాగా, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ డకౌట్ అయ్యారు...
 

79

ఫలితంగా 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. పవర్ ప్లే ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 14 పరుగులు మాత్రమే చేసిన సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత లోయెస్ట్ పవర్ ప్లే స్కోరు నమోదు చేసింది...
 

89

పవర్ ప్లే ముగిసిన తర్వాత కూడా సన్‌రైజర్స్ స్కోరు కార్డు ముందుకు సాగలేదు. సీజన్ మారినా, జట్టు మారినా... టీమ్ పర్ఫామెన్స్ మాత్రం ఏమీ మారలేదని అంటున్నారు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు.. 

99

అభిషేక్ శర్మ 19 బంతులాడి ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసి అవుట్ కావడంతో 8.2 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది సన్‌రైజర్స్. రన్ రేట్ 3.4 మాత్రమే.

click me!

Recommended Stories