కన్ఫార్మ్... దీపక్ చాహార్ రావట్లేదు! మరి చెన్నై సూపర్ కింగ్స్‌ని కాపాడే బౌలర్ ఎవరు...

Published : Apr 15, 2022, 05:42 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ని డిఫెండింగ్ ఛాంపియన్‌గా ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్, వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది. ఎట్టకేలకు ఐదో మ్యాచ్‌లో ఆర్‌సీబీని ఓడించిన తొలి విజయం అందుకున్న సీఎస్‌కేకి ఊహించని షాక్ తగిలింది...

PREV
17
కన్ఫార్మ్... దీపక్ చాహార్ రావట్లేదు! మరి చెన్నై సూపర్ కింగ్స్‌ని కాపాడే బౌలర్ ఎవరు...

గాయం కారణంగా మొదటి ఆరంభ మ్యాచులకు అందుబాటులో లేని దీపక్ చాహార్, వెన్ను గాయంతో ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు...

27

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 216 పరుగుల భారీ స్కోరు చేసింది సీఎస్‌కే. లక్ష్యఛేదనలో ఫాఫ్ డుప్లిసిస్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్ త్వరగా అవుటైనా ఆర్‌సీబీ 193 పరుగులు చేయగలిగింది...

37

దినేశ్ కార్తీక్ మరో రెండు ఓవర్లు క్రీజులో ఉండి ఉంటే మ్యాచ్ రిజల్ట్ మారిపోయేదే. మహీశ్ తీక్షణ 4, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లు ముఖేశ్ చౌదరి, క్రిస్ జోర్డాన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. 

47

స్పిన్నర్లు ఎంతగా రాణించినా పవర్ ప్లేలో వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటర్లను స్వల్ప స్కోరుకి కట్టడి చేయాలన్నా, డెత్ ఓవర్లలో టార్గెట్‌ని కాపాడుకోవాలన్ని సరైన పేస్ బౌలర్లు అవసరం...

57

దీపక్ చాహార్, ఐపీఎల్ 2022 సీజన్‌లో పాల్గొనడం లేదని ఖరారు కావడంతో అతని ప్లేస్‌ని భర్తీ చేసే బౌలర్‌ని వీలైనంత త్వరగా వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది సీఎస్‌కే...

67

దీపక్ చాహార్ కోసం రూ.14 కోట్లు ఖర్చు చేసిన చెన్నై సూపర్ కింగ్స్, బౌలర్ ముఖేశ్ చౌదరిపై భారీ ఆశలు పెట్టుకుంది. 4 మ్యాచుల్లో 3 వికెట్లు తీసిన ముఖేశ్ చౌదరి, 11.1 ఎకానమీతో పరుగులు ఇస్తూ నిరాశ పరుస్తున్నాడు..

77

అండర్ 19 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అదరగొట్టిన రాజ్‌వర్థన్ హంగేర్కర్‌కి ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ ఆడించని సీఎస్‌కే, అతనికి అవకాశం ఇస్తే బెటర్ అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్... 

click me!

Recommended Stories