విజయ్ శంకర్... ఈ పేరు చెప్పగానే చాలా మందికి అంబటి రాయుడు గుర్తుకు వస్తాడు. 2019 వన్డే వరల్డ్ కప్ జట్టులో అంబటి రాయుడిని కాదని విజయ్ శంకర్‌ని ఎంపిక చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. అప్పటి ఛీఫ్ సెలక్టర్ ‘త్రీడీ ప్లేయర్’ అంటూ శంకర్‌ని పొగడడం మరింత వైరల్ అయ్యింది...
వన్డే వరల్డ్ కప్ 2019 మ్యాచులను చూసేందుకు ‘త్రీడీ గ్లాసెస్’ ఆర్డర్ చేశానంటూ అంబటి రాయుడు ట్వీట్ వేయడం, భారత జట్టు సెమీస్‌లో ఓడి ఇంటిదారి పట్టడంతో విజయ్ శంకర్... బాగా పాపులారిటీ తెచ్చుకున్నాడు...
29
2019 వన్డే వరల్డ్ కప్‌లో వేసిన మొట్టమొదటి బంతికే వికెట్ తీసిన విజయ్ శంకర్, ప్రాక్టీస్ సెషన్స్‌లో బుమ్రా బౌలింగ్‌లో గాయపడి జట్టుకి దూరమయ్యాడు...
39
భారత జట్టుకి ఆడిన దానికంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్‌గా కూడా విజయ్ శంకర్... బీభత్సమైన పాపులారిటీ తెచ్చుకున్నాడు. చేతుల్లోకి వచ్చిన మ్యాచులను చేజేతులా ఓడగొట్టడం శంకరన్న స్పెషాలిటీ... అంటూ తీవ్రంగా ట్రోల్ చేసేవాళ్లు సన్‌రైజర్స్ ఫ్యాన్స్...
అలాంటి విజయ్ శంకర్‌ని గుజరాత్ టైటాన్స్ వేలంలో రూ.1.4 కోట్లకు కొనుగోలు చేసింది. గత రెండు మ్యాచుల్లో ఆకట్టుకున్న సాయి సుదర్శన్‌ని తప్పించి, రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో విజయ్ శంకర్‌కి చోటు ఇచ్చాడు హార్ధిక్ పాండ్యా...
69
అయితే గత మ్యాచ్‌లో 7 బంతులాడి 2 పరుగులకి అవుట్ అయ్యాడు విజయ్ శంకర్. మొత్తంగా ఈ సీజన్‌లో 3 మ్యాచులు ఆడిన విజయ్ శంకర్, 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అత్యధిక స్కోరు 13 పరుగులు...
79
విజయ్ శంకర్ ట్రాక్ రికార్డు చూసి కూడా అతన్ని కొనుగోలు చేసిన ఫ్రాంఛైజీలు, ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా, అమిత్ మిశ్రా, పియూష్ చావ్లా వంటి సీనియర్లను కొనుగోలు చేయకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్...
89
మూడు సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సురేష్ రైనాని కొనుగోలు చేయడానికి ఇష్టపడని చెన్నై సూపర్ కింగ్స్, విజయ్ శంకర్ కోసం రూ.కోటీ 30 లక్షల వరకూ బిడ్ వేయడం కొసమెరుపు...
99
విజయ్ శంకర్‌కి ఉన్న లక్‌లో సగం ఉన్నా జీవితంలో ఎంతో సాధించేవాళ్లమని, భారత జట్టులో కెప్టెన్‌గా కొనసాగేవాళ్లమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు...