ఆ టీమ్‌ని ఫాలో అవుతున్న గుజరాత్ టైటాన్స్... అప్పుడు రైనా, ఇప్పుడు పాండ్యా కెప్టెన్సీలో...

Published : Apr 15, 2022, 04:52 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో అంచనాలకు మించి రాణిస్తున్న జట్టు గుజరాత్ టైటాన్స్. సీజన్ ఆరంభానికి ముందు హార్ధిక్ పాండ్యాని కెప్టెన్‌గా ఎంచుకోవడం, టీమ్ కాంబినేషన్‌పై దృష్టి పెట్టకపోవడం, సరైన ఫారిన్ ప్లేయర్ లేకపోవడంతో గుజరాత్ టైటాన్స్‌... అట్టర్ ఫ్లాప్ అవుతుందని అంచనా వేశారు విశ్లేషకులు...

PREV
18
ఆ టీమ్‌ని ఫాలో అవుతున్న గుజరాత్ టైటాన్స్... అప్పుడు రైనా, ఇప్పుడు పాండ్యా కెప్టెన్సీలో...

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ని ఓడించిన గుజరాత్ టైటాన్స్, ఆ తర్వాత వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది...

28

మొదటి ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో విజయాలు అందుకున్న గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఓటమి చవి చూసింది...

38

సరిగ్గా గుజరాత్ పేరుతో ఇంతకుముందు వచ్చిన గుజరాత్ లయన్స్ జట్టు కూడా సరిగ్గా ఇదే ప్రదర్శన ఇవ్వడం విశేషం. సురేష్ రైనా కెప్టెన్సీలో 2016లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ లయర్స్, మొదటి 5 మ్యాచుల్లో నాలుగు విజయాలు అందుకుంది...

48

మొదటి మూడు మ్యాచుల్లో విజయాలు అందుకున్న గుజరాత్ లయన్స్, నాలుగో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓడింది. సరిగ్గా గుజరాత్ టైటాన్స్ కూడా ఇదే సీన్ రిపీట్ చేసింది...

58

మొదటి మూడు మ్యాచుల్లో గెలిచిన గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడింది. లయర్స్, ఐదో మ్యాచ్‌లో గెలిస్తే, టైటాన్స్ కూడా ఐదో మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది...

68

సరిగ్గా 2016లో గుజరాత్ లయన్స్‌ సాగినట్టే గుజరాత్ టైటాన్స్ సాగుతుండడంతో ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్.. రెండోసారి టైటిల్ గెలవబోతుందని అంటున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్...

78

2016 సీజన్‌లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఐపీఎల్ టైటిల్ గెలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో టేబుల్ టాపర్ టీమ్స్‌ని ఓడించి, టైటిల్ గెలిచింది.

88

2016లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఫైనల్ చేరింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దీంతో ఈసారి ఆర్‌సీబీ ఫైనల్ చేరుతుందని ఆశపడుతున్నాడు ‘ఈ సాలా కప్ నమ్‌దే’ ఫ్యాన్స్...

click me!

Recommended Stories