టెండూల్కర్‌ని అవుట్ చేయగానే కోల్‌కత్తా జనాలు చప్పట్లు కొట్టారు... షోయబ్ అక్తర్ కామెంట్స్...

Published : Apr 05, 2022, 01:38 PM IST

ఐపీఎల్... టీమిండియా ఫ్యాన్స్‌ని రోహిత్ అభిమానులుగా, విరాట్ ఫ్యాన్స్‌గా, ధోనీ సపోర్టర్లుగా విడదీసే క్రికెట్ లీగ్. ఐపీఎల్‌ కారణంగా ఫారిన్ ప్లేయర్లు ఏబీ డివిల్లియర్స్, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ వంటి వాళ్లు కూడా ఇండియన్ ఫ్యాన్స్‌కి చేరువయ్యారు... సోహైల్ తన్వీర్, షోయబ్ అక్తర్ వంటి పాక్ క్రికెటర్లకు కూడా ఈ లిస్టులో చోటు ఉంటుంది.

PREV
111
టెండూల్కర్‌ని అవుట్ చేయగానే కోల్‌కత్తా జనాలు చప్పట్లు కొట్టారు... షోయబ్ అక్తర్ కామెంట్స్...
Shoaib Akhtar

ఓ పాకిస్తాన్ క్రికెటర్, భారత ప్లేయర్‌ని అందులోనూ అశేష అభిమానులు ఉన్న సచిన్ టెండూల్కర్‌ని అవుట్ చేస్తే భారత జనాలు చప్పట్లు కొట్టడం ఎప్పుడైనా జరిగేనా... 

211
Shoaib Akhtar

అయితే ఇది జరుగుతుందని తాను కూడా ఊహించలేదని, ఐపీఎల్‌ కారణంగా ఆ వింత అనుభూతిని తాను ఆస్వాదించానని అంటున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...

311

‘1999లో కోల్‌కత్తాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్‌ని డకౌట్ చేశాడు. మొదటి బంతికే సచిన్ అవుట్ అయ్యాడు. అప్పటి  నుంచి కోల్‌కత్తా ఫ్యాన్స్‌ నన్ను ఇష్టపడేవాళ్లు కాదు...

411

అయితే ఐపీఎల్‌లో ఆడినప్పుడు కోల్‌కత్తా జనాలు నాపై చూపించిన ప్రేమాభిమానులు నన్ను ఆశ్చర్యపరిచారు. బెంగాల్‌ జనాలందరూ నా పేరు అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు...

511

ఈడెన్ గార్డెన్స్‌, నాకు ఎంతో ఇష్టమైన క్రికెట్ గ్రౌండ్లలో ఒకటి. ఈ రోజు వరకూ ఆ స్టేడియంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం కొనసాగుతూనే ఉంది...

611
Sachin Tendulkar, Shoaib Akhtar

కోల్‌కత్తా టెస్టులో సచిన్ టెండూల్కర్‌ని అవుట్ చేసిన తర్వాత టీమిండియా ఫ్యాన్స్, నాపై పీకల్లోతు కోపంతో ఊగిపోయారు. నన్ను కొట్టాలని రాళ్లు, బాటిల్స్ విసిరారు...

711

అయితే షారుక్ ఖాన్ కేకేఆర్ తరుపున ఆడడానికి కోల్‌కత్తాకి వెళ్లినప్పుడు నన్ను సాదరంగా ఆహ్వానించారు. అప్పుడు నేను బ్యాన్ తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్నా...

811

సరైన ప్రాక్టీస్ లేదు, ఫిట్‌గా కూడా లేను. వాళ్లు గెలవడానికి 134 పరుగులు చేస్తే చాలు. ఆ మ్యాచ్‌కి ముందు నేను చాలా కఠినంగా ప్రాక్టీస్ చేశా...

911

సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేయడానికి పరుగెత్తుకుంటూ వచ్చా. నా కష్టాన్ని జనాలందరూ చూశారు. అందుకే సచిన్‌ని రనౌట్ చేసిన తర్వాత తర్వాత చప్పట్లతో అభినందించారు...

1011

అలా కోల్‌కత్తాతో, ఈడెన్ గార్డెన్స్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది...’ అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...

1111

ఐపీఎల్ 2008లో కేకేఆర్ తరుపున ఆడిన షోయబ్ అక్తర్, 3 మ్యాచులు ఆడి 5 వికెట్లు పడగొట్టాడు. ఆరంభ సీజన్ తర్వాత పాక్ క్రికెటర్లకు ఐపీఎల్‌ ఆడే అవకాశం రాలేదు. 

click me!

Recommended Stories